Share News

భూసార పరీక్షల వల్ల అధిక దిగుబడులు

ABN , Publish Date - Nov 04 , 2025 | 11:16 PM

భూసార పరీక్షల ద్వారానే రైతులు అధిక దిగుబడి సాధించవచ్చని జిల్లా వ్యవసాయ అధికారి యశ్వంత్‌రావు అన్నారు.

భూసార పరీక్షల వల్ల అధిక దిగుబడులు
రైతులకు మట్టి పరీక్ష పత్రాలు పంపిణీ చేస్తున్న జిల్లా వ్యవసాయ అధికారి యశ్వంత్‌రావు

పెంట్లవెల్లి నవంబరు 4 (ఆంధ్రజ్యోతి) : భూసార పరీక్షల ద్వారానే రైతులు అధిక దిగుబడి సాధించవచ్చని జిల్లా వ్యవసాయ అధికారి యశ్వంత్‌రావు అన్నారు. మంగళవారం మండల కేంద్రం లోని రైతు నేస్తం వీడియో కాన్ఫ రెన్స్‌ ద్వారా రైతులకు అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడు తూ రైతులు పొలాల్లో మట్టి న మూనా ఫలితాల ఆధారంగా పం టలు సాగు చేసుకోవాలని రైతుల కు సూచించారు. రసాయనిక కాంప్లెక్స్‌ ఎరువు లు వాడకం తగ్గించి సేంద్రియ, జీవ సంబం ధిత ఎరువులను వాడాలన్నారు. కార్యక్రమంలో కొల్లాపూర్‌ డివిజన్‌ ఇన్‌చార్జి ఏడీఐ చిన్న హు స్సేన్‌, మండల వ్యవసాయ అధికారి వికాస్‌, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు నరసింహ యాద వ్‌, నాయకులు రామన్‌గౌడ్‌, భీంరెడ్డి, గురక ఆంజనేయులు, నాగిరెడ్డి, రవి రైతులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 04 , 2025 | 11:16 PM