BJP Leader Ramchander Rao: గ్రూప్-1 పై హైకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు
ABN , Publish Date - Sep 11 , 2025 | 05:44 AM
గ్రూప్-1 మెయిన్స్‌కు హాజరైన అభ్యర్థుల సమాధాన పత్రాలను పునర్ మూల్యాంకనం చేయాలని హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర...
గ్రూప్-1 మెయిన్స్‌కు హాజరైన అభ్యర్థుల సమాధాన పత్రాలను పునర్ మూల్యాంకనం చేయాలని హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ . రాంచందర్ రావు అన్నారు. టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 మెయిన్స్ నిర్వహణలో లెక్కలేనన్ని అవకతవకలు జరిగాయని తేలిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి లక్షలాది మంది విద్యార్థుల పాలిట శాపంగా మారిందని మండిపడ్డారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనూ పేపర్ లీకేజీ ఘటనలతో వేలాది మంది విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని, ప్రస్తుతం అదే పరంపరను కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తోందని ఆయన విమర్శించారు. కాగా, బీజేపీలో పైరవీలు, డబ్బుల మూటలతో పదవులు రావని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల అశోక్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకర్లతో అన్నారు. తనను పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించినందుకు గానూ.. రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, జాతీయ అధ్యక్షుడు నడ్డా, కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లకు ధన్యవాదాలు తెలిపారు