Price Hike for Akhand 2 Tickets: అఖండ-2 టికెట్ ధరల పెంపు మెమో సస్పెండ్ చేసిన హైకోర్టు
ABN , Publish Date - Dec 12 , 2025 | 05:07 AM
సినీహీరో బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన అఖండ-2 సినిమా టికెట్ ధరల పెంపు, గురువారం రాత్రి 8 గంటలకు టికెట్....
హైదరాబాద్, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): సినీహీరో బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన అఖండ-2 సినిమా టికెట్ ధరల పెంపు, గురువారం రాత్రి 8 గంటలకు టికెట్ ధర రూ.600 చొప్పున ప్రీమియర్ షో ప్రదర్శించడానికి అనుమతి ఇస్తూ రాష్ట్ర ప్రభు త్వం జారీచేసిన మెమోను హైకోర్టు సస్పెండ్ చేసింది. పెంచిన రేట్ల ప్రకారం టికెట్‌లను విక్రయించరాదని స్పష్టం చేసింది. హైకోర్టు జారీచేసిన ఈ ఉత్తర్వుల సమాచారాన్ని మెమో జారీచేసిన హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి సంబంధిత నిర్మాణ సంస్థ, బుక్‌మై షో తదితరులకు తెలియజేయాలని పేర్కొంది. ఈ ఉత్తర్వులకు కచ్చితంగా అమలు చేయాలని పేర్కొంది.