Share News

kumaram bheem asifabad-హౖకోర్టు తీర్పుతో స్థానిక ఎన్నికలకు బ్రేక్‌

ABN , Publish Date - Oct 09 , 2025 | 10:38 PM

స్థానిక సంస్థల ఎన్నికలకు వడివడిగా అడుగులు పడుతున్న వేళ హైకోర్టు తీర్పుతో ఎన్నికలకు బ్రేక్‌ పడింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ కల్పించడంపై హైకోర్టు స్టే విధించింది. ఈ మేరకు గురువారం మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది.

kumaram bheem asifabad-హౖకోర్టు తీర్పుతో స్థానిక ఎన్నికలకు బ్రేక్‌
: సిర్పూర్‌(టి) నామినేషన్‌ కేంద్రాన్ని పరిశీలిస్తున్న జిల్లా అసిస్టెంట్‌ ఎన్నికల అధికారి దీపక్‌ తివారి

- తొలి రోజు ఎంపీటీసీ స్థానాలకు 8, జడ్పీటీసీ స్థానానికి ఒక నామినేషన్‌

ఆసిఫాబాద్‌, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికలకు వడివడిగా అడుగులు పడుతున్న వేళ హైకోర్టు తీర్పుతో ఎన్నికలకు బ్రేక్‌ పడింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ కల్పించడంపై హైకోర్టు స్టే విధించింది. ఈ మేరకు గురువారం మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. నాలుగు వారాల్లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలకు తాత్కాలికంగా బ్రేక్‌ పడినట్లయింది. రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్‌ విడుదల చేయగా దీనికి తగట్టు జిల్లాలోని అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మొదటి విడత పరిషత్‌ ఎన్నికలకు సంబంఽధించి సర్వం సిద్ధం చేశారు. మొదటి విడత ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభించగా తొలి రోజు ఎంపీటీసీ స్థానాలకు 8 నామినేషన్లు, జడ్పీటీసీ స్థానానికి 1 నామినేషన్‌ కూడా దాఖలు అయ్యాయి. జీవో నెం.9పై హైకోర్టు స్టే విధించడంతో ఎన్నికల ప్రక్రియ తాత్కాలికంగా నిలిచి పోయింది.

మొదటి విడతలో..

జిల్లాలో 15 జడ్పీటీసీ, 127 ఎంపీటీసీ స్థానాలకు గానూ మొదటి విడతలో సిర్పూర్‌ నియోజకవర్గంలో 7 మండలాలతో పాటు ఆసిఫాబాద్‌ నియోజక వర్గంలోని రెబ్బెన మండలంను కలుపుకుని మొత్తం 8 మండలాల్లోని 8 జడ్పీటీసీ స్థానాలకు, 71 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు నిర్ణయించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మే రకు అధికారులు గురువారం ఉదయం 10.30 గంటల నుంచి ఆయా ఎంపీడీవో కార్యాల యాల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియను ప్రారంభించింది. మొదటి రోజు 8 మండలాల పరిధిలో ఎంపీటీసీ స్థానాలకు 8, జడ్పీటీసీ స్థానానికి 1 నామినేషన్‌ దాఖలయ్యాయి. హైకోర్టు తీర్పుతో ప్రక్రియ ఎక్కడికక్కడే నిలిచి పోవాల్సి వచ్చింది. కాగా కొంత కాలంగా స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఎదురు చూస్తున్న ఆశావవహులు హైకోర్టు తీర్పుతో అయోమయంలో పడ్డారు. ఎన్నికల బరిలో నిలిచేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్న ఆశావాహులకు కోర్టు తీర్పుతో తాత్కాలికంగా మరికొంత కాలం వేచి చూడాల్సిన పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. దీంతో మరికొన్ని రోజులు పోటీదారులపై అదనపు భారం పడే అవకాశం లేక పోలేదు.

నామినేషన్లు దాఖలు

కాగజ్‌నగర్‌/సిర్పూర్‌(టి)/చింతలమానేపల్లి/కౌటాల, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికలకు పలువురు నామినేషన్లల దాఖలు చేశారు. కాగజ్‌నగర్‌ మండలంలోని ఆయా మండలాల నుంచి ఎంపీటీసీ, జడ్పీటీసీలకు నామినేషన్లు దాఖాలు చేసేందుకు అభ్యర్థులు ఎంపీడీవో కార్యాలయానికి చేరుకున్నారు. కాగజ్‌నగర్‌ రూరల్‌ ఎస్సై సందీప్‌ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు నిర్వహించారు. కాగజ్‌నగర్‌ భట్టుపల్లి ఎంపీటీసీ స్థానానికి ఒక నామినేషన్‌ మాత్రమే దాఖలైనట్టు ఎంపీడీవో వాసు తెలిపారు. సిర్పూర్‌(టి) మండలంలో మొదటి రోజు రెండు నామినేషన్లు దాఖలు అయ్యాయి. మండలంలోని డోర్‌పల్లి ఎంపీటీసీ స్థానికి గాను జాడె కోటేశ్వర్‌, జాడె గౌతమిలు తమ నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎన్నికల అధికారి తెలిపారు. చింతలమానేపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో స్థానిక ఎన్నికల్లో భాగంగా గురువారం ఎంపీటీసీ స్థానాలకు రెండు, జడ్పీటీసీ స్థానానికి ఒక నామినేషన్‌ దాఖలు అయినట్లు ఎంపీడీవో సుధాకర్‌రెడ్డి తెలిపారు. నామినేషన్‌ కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్‌, జిల్లా అసిస్టెంట్‌ ఎన్నికల అధికారి దీపక్‌ తివారి సబ్‌ కలెక్టర్‌ శ్రద్ధాశుక్లాతో కలసి పరిశీలించి పలు సూచనలు చేశారు. కౌటాల మండలంలోని కౌటాల ఎంపీటీసీ స్థానికి మొదటి రోజు ఒక నామినేషన్‌ దాఖలు అయినట్లు ఎంపీడీవో ప్రసాద్‌ తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి బట్టమేకల గట్టయ్య తన నామినేషన్‌ను దాఖలు చేశారు.

Updated Date - Oct 09 , 2025 | 10:38 PM