High Court: ఎంపీహెచ్‌ఎస్ పోస్టుల్లో సర్వీసు వెయిటేజీ పెంపు చెల్లదు
ABN , Publish Date - Nov 23 , 2025 | 06:53 AM
మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ఎంపీహెచ్‌ఏ) పోస్టుల భర్తీలో పాల్గొనే కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి వెయిటేజీనీ 20 మార్కుల నుంచి 30 మార్కులకు పెంచడం...
అసలు నోటిఫికేషన్‌లోని నిబంధనలను పాటించండి
హైకోర్టు స్పష్టీకరణ
హైదరాబాద్, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ఎంపీహెచ్‌ఏ) పోస్టుల భర్తీలో పాల్గొనే కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి వెయిటేజీనీ 20 మార్కుల నుంచి 30 మార్కులకు పెంచడం చెల్లదని హైకోర్టు పేర్కొంది. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ సర్వీసుల్లో ఉన్న వారికి సర్వీసు వెయిటేజీ కల్పిస్తూ వైద్యఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ జారీచేసిన జీవో 133ను కొట్టివేసింది. అసలు నోటిఫికేషన్‌లోని నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ ఎంపీహెచ్‌ఎ్‌స (మహిళ) ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తిచేయాలని స్పష్టం చేసింది. మధ్యలో సర్వీసు వెయిటేజీని ఏకపక్షంగా పెంచడం అక్రమమని, రాజ్యాంగవిరుద్ధమని పేర్కొంటూ పలువురు సాధారణ అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది చిల్లా రమేశ్ వాదిస్తూ.. సర్వీసు వెయిటేజీ పెంపు గత తీర్పులకు విరుద్ధమని, న్యాయసమీక్షకు నిలబడదని పేర్కొన్నారు. వాదనలు విన్న జస్టిస్ పుల్లా కార్తీక్ ధర్మాసనం.. సర్వీసు వెయిటేజీ పెంపు జీవోను, సవరణ నోటిఫికేషన్‌ను కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది.