Hyderabad High Court: పేలుళ్లకు అనుమతులు ఎలా ఇచ్చారో చెప్పండి ?
ABN , Publish Date - Sep 17 , 2025 | 05:39 AM
హైదరాబాద్, జూబ్లీహిల్స్‌లోని న్యాయవిహార్ ప్రాంతంలో భారీ భవనాల నిర్మాణంలో భాగంగా కొండరాళ్ల తొలగింపునకు 24 గంటల పాటు భారీ పేలుళ్లు చేపట్టిన వ్యవహారంలో...
జూబ్లీహిల్స్‌లో కొండరాళ్ల తొలగింపులో సీపీ వివరణపై హైకోర్టు అసహనం, నోటీసులు
హైదరాబాద్, జూబ్లీహిల్స్‌లోని న్యాయవిహార్ ప్రాంతంలో భారీ భవనాల నిర్మాణంలో భాగంగా కొండరాళ్ల తొలగింపునకు 24 గంటల పాటు భారీ పేలుళ్లు చేపట్టిన వ్యవహారంలో హైదరాబాద్ పోలీసు కమిషనర్(సీపీ) ఇచ్చిన వివరణపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఆ ప్రాంతంలో చేపట్టిన పేలుళ్లకు సంబంధించిన అంశంపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై జరిగిన గత విచారణలో.. పేలుళ్లకు ఏ ప్రాతిపదికన అనుమతి ఇచ్చారో చెప్పండంటూ హైకోర్టు సీపీని ఆదేశించింది. చీఫ్ జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ ధర్మాసనం ఈ పిటిషన్‌పై మంగళవారం మళ్లీ విచారణ చేపట్టింది. ఏఏజీ ఇమ్రాన్‌ఖాన్ వాదిస్తూ.. నిర్మాణ ప్రాంతంలో కొండరాళ్లను తొలగించేందుకు అనుమతి ఇచ్చే అధికారం సీపీకి ఉంటుందని తెలిపారు. వాదనలు విన్న ధర్మాస నం.. తాము అడిగిన సమాచారం సీపీ ఇవ్వలేదని పేర్కొంది. ఈ అంశంలో హైదరాబాద్ సీపీని ప్రతివాది చేర్చి వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. విచారణను ఈనెల 23కు వాయిదా వేసింది.