Telangana High Court: ముందు సీటు ఇవ్వండి.. కుల ధ్రువీకరణ ఆ తరువాత..
ABN , Publish Date - Oct 15 , 2025 | 03:48 AM
కుల ధ్రువీకరణ పత్రం సరైందా? కాదా? అని పరిశీలన జరిపేలోపు కోచింగ్ క్లాసులు మిస్ అవుతాయని అందువల్ల తొలుత అభ్యర్థికి సీటు ఇవ్వాలని ఎస్టీ...
ఎస్టీ స్టడీ సర్కిల్‌కు హైకోర్టు ఆదేశాలు
హైదరాబాద్, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): కుల ధ్రువీకరణ పత్రం సరైందా? కాదా? అని పరిశీలన జరిపేలోపు కోచింగ్ క్లాసులు మిస్ అవుతాయని అందువల్ల తొలుత అభ్యర్థికి సీటు ఇవ్వాలని ఎస్టీ స్టడీ సర్కిల్‌కు హైకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. ముందు సీటు ఇచ్చిన తరువాత కుల ధ్రువీకరణ పత్రాలను తనిఖీ చేసుకోవచ్చని తెలిపింది. నిజామాబాద్ జిల్లా ముప్కల్ మండలానికి చెందిన డి కార్తీక్ కుమార్ యూపీఎస్సీ పరీక్షలకు సిద్థమవ్వాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వ ఎస్టీ స్టడీ సర్కిల్ నిర్వహించిన పరీక్షకు హాజరై అర్హత సాధించారు. ధ్రువపత్రాల పరిశీలన సందర్భంగా అతని ఎస్టీ సర్టిఫికెట్ సరైంది కాదని అధికారులు భావించి సీటు నిరాకరించారు. దీనిపై ఆ అభ్యర్థి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన జస్టిస్ ఈవి వేణుగోపాల్ ధర్మాసనం.. ముందు సీటు ఇచ్చి, తరువాత పరిశీలన జరుపుకోవాలని అధికారులకు సూచించింది.