Dismisses 3 Criminal Cases Against KTR: కేటీఆర్‌పై మూడు క్రిమినల్ కేసుల కొట్టివేత
ABN , Publish Date - Sep 10 , 2025 | 04:38 AM
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై నల్గొండ జిల్లా నకిరేకల్ పోలీ్‌సస్టేషన్‌లో నమోదైన మూడు క్రిమినల్ కేసులను హైకోర్టు మంగళవారం కొట్టివేసింది....
హైదరాబాద్, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై నల్గొండ జిల్లా నకిరేకల్ పోలీ్‌సస్టేషన్‌లో నమోదైన మూడు క్రిమినల్ కేసులను హైకోర్టు మంగళవారం కొట్టివేసింది. నకిరేకల్ సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో తెలుగు ప్రశ్న పత్రం లీక్ అయిదంటూ కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇది సరికాదని, ఆయన తప్పుడు సమాచారం వ్యాప్తి చేశారని పేర్కొంటూ పలువురు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నకిరేకల్ పోలీసులు మూడు వేర్వేరు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. ఒకే అంశంపై వేర్వేరు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడం చెల్లదని, వాటిని కొట్టివేయాలని కోరుతూ ఆయన హైకోర్టులో క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ చేపట్టిన జస్టిస్ కే లక్ష్మణ్ ధర్మాసనం పిటిషన్లను కొట్టివేసింది.