High Court: టీచర్ల నియామకం కేసులో ప్రతివాదిగా స్పోర్ట్స్ అథారిటీ
ABN , Publish Date - Sep 18 , 2025 | 05:11 AM
డీఎస్సీ-2024లో స్పోర్ట్స్ కోటా కింద ఎస్జీటీ టీచర్ల నియామకంపై దాఖలైన పిటిషన్‌లో స్పోర్ట్స్ అథారిటీని ప్రతివాదిగా చేరుస్తూ హైకోర్టు బుధవారం నోటీసులు జారీచేసింది....
డీఎస్సీ-2024లో స్పోర్ట్స్ కోటా కింద ఎస్జీటీ టీచర్ల నియామకంపై దాఖలైన పిటిషన్‌లో స్పోర్ట్స్ అథారిటీని ప్రతివాదిగా చేరుస్తూ హైకోర్టు బుధవారం నోటీసులు జారీచేసింది. డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరిగాయని పేర్కొంటూ పలువురు అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన జస్టిస్ పుల్ల కార్తీక్ ధర్మాసనం ఈ ఆదేశాలు ఇచ్చింది. అక్రమాలపై పునః పరిశీలన చేస్తామని పేర్కొన్న స్పోర్ట్స్ అథారిటీ అధికారులు ఇప్పటికీ స్పందించడం లేదని పిటిషనర్లు పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. స్పోర్ట్స్ అథారిటీని ప్రతివాదిగా చేర్చి.. వివరణ ఇవ్వాలని నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణ అక్టోబర్ 15కు వాయిదా వేసింది.