టోల్ ప్లాజాల రూట్లలో అధిక వడ్డింపు
ABN , Publish Date - Jun 20 , 2025 | 11:44 PM
మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్న ఆర్టీసీ...తద్వారా కో ల్పోతున్న ఆదాయం లోటును భర్తీ చేసేందుకు ప్రయా ణికులపై భారం మోపుతోంది. మంచిర్యాల డిపో నుం చి టోల్ గేట్లు ఉన్న హైద్రాబాద్, బెల్లంపల్లి రూట్లలో ప్రయాణించే అన్ని రకాల బస్సుల్లో అదనపు చార్జీలు వసూలు చేస్తున్నారు.
-ఒక్కో బూత్‌కు రూ. 10 చొప్పున వసూలు
-ప్రయాణికులపై ఆర్టీసీ అడ్డగోలు బాదుడు
-హైద్రాబాద్ రూట్‌లో ఒక్కొక్కరికి రూ. 30 అదనం
మంచిర్యాల, జూన్ 20 (ఆంధ్రజ్యోతి): మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్న ఆర్టీసీ...తద్వారా కో ల్పోతున్న ఆదాయం లోటును భర్తీ చేసేందుకు ప్రయా ణికులపై భారం మోపుతోంది. మంచిర్యాల డిపో నుం చి టోల్ గేట్లు ఉన్న హైద్రాబాద్, బెల్లంపల్లి రూట్లలో ప్రయాణించే అన్ని రకాల బస్సుల్లో అదనపు చార్జీలు వసూలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న హైవేల్లోని టోల్ ప్లాజాల్లో రేట్లను పెంచుతూ నేషనల్ హైవే అథా రిటీ ఆఫ్ ఇండియా ఇటీవల నిర్ణయం తీసుకున్న విష యం తెలిసిందే. దీంతో ఇంతకాలం ఆయా రూట్లలో ఉన్న టోల్ ఫీజులు పెరిగాయి. ఆ భారాన్ని తప్పించు కునేందుకు ఆర్టీసీ ప్రయాణికుల వద్ద యూజర్ చార్జీల పేరుతో అదనంగా వసూలు చేస్తోంది. కాంగ్రెస్ ప్రభు త్వం మహిళలకు ఉచిత ప్రయాణాన్ని అందిస్తూ త మపై భారం మోపడం సమంజసం కాదని ప్రయాణి కులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఒక్కో టోల్ ప్లాజాకు రూ. 10 వసూలు...
టోల్ ప్లాజాలు ఉన్న రూట్లలో ఒక్కో టోల్ గేట్‌కు రూ. 10 చొప్పున ఆర్టీసీ ప్రయాణికుల నుంచి వసూలు చేస్తోంది. మంచిర్యాల డిపో నుంచి హైద్రాబాద్ వెళ్లే బ స్సు గమ్యం చేరేలోపు మూడు టోల్ ప్లాజాలను దాటా ల్సి ఉంటుంది. అలా మూడు చోట్ల ఒక్కో ప్రయాణి కుడికి రూ. 10 చొప్పున మొత్తం రూ. 30 అదనంగా వ సూలు చేస్తోంది. అలాగే మంచిర్యాల నుంచి బెల్లంపల్లి వైపు వెళ్లే బస్సులు సోమగూడెం వద్ద ఒక టోల్ ప్లాజా దాటాల్సి ఉంటుంది. అటు వైపు ప్రయాణం చేసే వారికి రూ. 10 చొప్పున అదనపు చార్జీ వసూలు చే స్తోంది. పెరిగిన చార్జీలు ఈ నెల 13 నుంచి అమలవు తుండగా, టోల్ గేట్ల వద్ద చెల్లించే దానికంటే అదనంగా వడ్డిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మంచిర్యాల నుంచి హైద్రాబాద్ వెళ్లే క్రమంలో మూడో చోట్ల టోల్ గేట్లు ఉండగా, ఒక్కో చోట బస్సుకు రాను పోను రూ. 300 వరకు టాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. అలా మూడు చోట్లలో గరిష్టంగా రూ.1000 వరకు టో ల్ టాక్స్ చెల్లిస్తుంది. ఒక్కో బస్సులో సగటున 40 మం ది ప్రయాణిస్తారు. రానుపోను కనీసం 80 మంది ప్ర యాణాలు సాగిస్తారు. అలా ఒక్కొక్కరి వద్ద రూ. 60 చొప్పున రూ. 4800 వరకు ఆర్టీసీ ప్రయాణికుల నుంచి వసూలు చేస్తోంది. ఈ క్రమంలో టోల్ గేట్ల వద్ద అ య్యే ఖర్చు కంటే అదనంగా దాదాపు ఐదు రెట్లు వసూ లు చేస్తుండటం గమనార్హం. ఇదిలా ఉండగా ఆర్టీసీ బస్సుల్లో ఫాస్టాగ్ ద్వారా నెలవారీ టాక్స్ చెల్లింపులు చే స్తుంది. అలా మరింతగా తక్కువ మొత్తంలో టోల్ చె ల్లిస్తుంది. అయినప్పటికీ ప్రయాణికుల నుంచి మా త్రం రానుపోను రూ. 60 ముక్కుపిండి వసూలు చే స్తోంది. మంచిర్యాల జిల్లా నుంచి హైదరాబాద్‌కు ని త్యం రెండు వేల మంది ప్రయాణాలు సాగిస్తారని అధి కారులు చెబుతున్నారు. ఆ లెక్కన ఒక్కో ప్రయాణికుడికి రూ. 30 చొప్పుల నిత్యం రూ. 60వేల ఆదాయం సమకూరుతుంది. అలాగే మంచిర్యాల నుంచి బెల్లంప ల్లి వైపు నిత్యం 5వేల మంది ప్రయాణాలు సాగిస్తారు. ఈ రూట్‌లో రోజుకి రూ. 50వేల కలెక్షన్ టోల్ టాక్స్ రూపంలో సమకూరుతుంది. అంటే టోల్ ప్ర్లాజాల పే రుతో ఆర్టీసీ ఒక్క మంచిర్యాల జిల్లా నుంచే నిత్యం లక్షా పదివేల ఆదాయం అదనంగా సమకూర్చుకుంటుంది. మొత్తానికి ఎన్‌హెచ్‌ఏఐ నిబంధనలు ప్రయాణికుల నడ్డి విరుస్తుండగా ఆర్టీసీకి కాసుల వర్షం కురిపిస్తోంది.
పెరిగిన చార్జీలు...
ఆర్టీసీ టోల్ చార్జీలు వసూలు చేస్తుండటంతో వివిధ రూట్లలో టికెట్ ధరలు పెరిగాయి. మంచిర్యాల నుంచి హైద్రాబాద్‌కు వెళ్లే సూపర్ లగ్జరీ బస్సుకు గతంలో రూ. 470 చార్జి ఉండేది. అలాగే బెల్లంపల్లి వైపు వెళ్లే వారికి రూ. 60 ఉండేది. ప్రస్తుతం టోల్ పేరిట వసూ లు చేస్తున్న చార్జీల కారణంగా హైద్రాబాద్‌కు రూ. 30 పెరగగా, బెల్లంపల్లికి రూ. 10 అదనంగా పెరిగింది. ఇ దిలా ఉండగా ప్రయాణించే కిలోమీటర్లను సైతం పెం చి ఆర్టీసీ అదనంగా వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉదాహరణకు ఒక బస్సు 41 కిలోమీటర్లు ప్రయాణిం చాల్సి ఉంటే దాన్ని 45 కిలోమీటర్లకు రౌండప్ చేసి, ఆ మేరకు టికెట్ ధరను పెంచి వసూలు చేస్తున్నారు. ఇ లా ప్రయాణికులపై ఆర్టీసీ తెలియకుం డానే భారం మోపడం పట్ల ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఆ ర్టీసీ యాజమాన్యం ఇలా ప్రయాణికులను నిలువు దో పిడీకి గురి చేయడం సమంజసం కాదనే అభిప్రా యాలు వ్యక్తమవుతున్నాయి.