సరిహద్దులో హై అలర్ట్
ABN , Publish Date - Sep 22 , 2025 | 10:56 PM
మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో పోలీసులు హై అలెర్ట్ ప్ర కటించారు. ఈ నెల 21 నుంచి 27 వరకు మావోయిస్టు వారోత్సవాల నేప థ్యంలో సరిహద్దులో ఎలాంటి అలజడులకు తావివ్వకుండా పోలీసులు అ ప్రమత్తమయ్యారు.
-ప్రాణహిత నది తీరం వెంట పోలీసుల తనిఖీలు
కోటపల్లి, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి) : మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో పోలీసులు హై అలెర్ట్ ప్ర కటించారు. ఈ నెల 21 నుంచి 27 వరకు మావోయిస్టు వారోత్సవాల నేప థ్యంలో సరిహద్దులో ఎలాంటి అలజడులకు తావివ్వకుండా పోలీసులు అ ప్రమత్తమయ్యారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా రెండు రోజు లుగా చెన్నూరు రూరల్ సీఐ బన్సీలాల్, నీల్వాయి,కోటపల్లి ఎస్‌ఐలు కోటే శ్వర్, రాజేందర్‌లు మండలంలోని ప్రాణహిత నది తీరం వెంట తని ఖీలు చేపట్టారు. ప్రాణహిత నది మార్గంలోని ఫెర్రీ పాయింట్లను పరిశీ లించా రు. సరిహద్దు గ్రామాల నుంచి మహారాష్ట్ర వైపు నది మార్గంలో జరుగుతున్న రాకపోకలకు తనిఖీలు చేపట్టి జాలర్లు, పడవల నిర్వహకు లతో మాట్లాడారు. అనుమానస్పద వ్యక్తులు కనబడితే తమకు సమాచా రం అందించాలని, అపరిచిత వ్యక్తులకు సహకారం అందించకూడదని సూచించారు. మరో వైపు జాతీయ రహదారిపై అంతర్ రాష్ట్ర వంతెన వద్ద పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఆటోలు, కార్లు, ద్విచక్రవాహ నాలను తనిఖీలు చేసి ప్రయాణికుల వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ బన్సీలాల్ మాట్లాడుతూ మావోయిస్టులు అడవుల్లో ఉం డి హింసాత్మక ఘటనలకు పాల్పడుతూ సాధించేది ఏమి లేదని, జన జీవన స్రవంతిలో కలిసి కుటుంబీకులతో కలిసి జీవితం గడపాలని కోరారు.