Share News

kumaram bheem asifabad- వీధి వ్యాపారులకు చేయూత

ABN , Publish Date - Sep 21 , 2025 | 11:19 PM

వీధి వ్యాపారులకు చేయూతని చ్చేందుకు కేంద్ర ప్రభుత్వం మున్సిపాలిటీల్లో మెప్మా ఆధ్వర్యంలో లోక్‌ కల్యాణ్‌ పేరిట రుణాలను అందించనుంది. ఈ మేరకు ఆయా మున్సిపాల్టీల్లో అధికారులు, సిబ్బంది ప్రక్రియను ప్రారంభించారు.

kumaram bheem asifabad- వీధి వ్యాపారులకు చేయూత
మేళా నిర్వహిస్తున్న మెప్మా సిబ్బంది(ఫైల్‌)

- అక్టోబరు 2 వరకు కొనసాగనున్న ప్రక్రియ

- మెప్మా అధికారులకు మార్గదర్శకాలు జారీ

కాగజ్‌నగర్‌ టౌన్‌, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): వీధి వ్యాపారులకు చేయూతని చ్చేందుకు కేంద్ర ప్రభుత్వం మున్సిపాలిటీల్లో మెప్మా ఆధ్వర్యంలో లోక్‌ కల్యాణ్‌ పేరిట రుణాలను అందించనుంది. ఈ మేరకు ఆయా మున్సిపాల్టీల్లో అధికారులు, సిబ్బంది ప్రక్రియను ప్రారంభించారు. అర్హుల జాబితాను తీసుకొని సంబంధిత దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. జిల్లాలో వీఽఽధి వ్యాపారులకు మేళాలు నిర్వహిస్తూ రుణాల మంజూరుకు కసరత్తు చేస్తున్నారు. వీధి వ్యాపారులను ఎస్‌ఎస్‌జీ(స్వయం సహాయక సంఘాలు) ఏర్పాటు చేసి వారి ఆర్థిక బలోపేతానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో ఐదు వేల మందికి ఈ పథకం కింద అర్హత పొందే అవకాశాలున్నాయి. గతంలో కొవిడ్‌ సమయంలో వీధి వ్యాపారులకు ఆత్మ నిర్భర్‌ భారత్‌ కింద రుణాలు పంపిణీ చేశారు. అవి సత్ఫలితాలివ్వడంతో కేంద్ర ప్రభుత్వం వీరికి ఈ ఏడాది కూడా చిరు వ్యాపా రులకు రుణాలు సకాలంలో అందించాలని లోక్‌ కల్యాణ్‌ పథకాన్ని ఏర్పాటు చేసింది.

- వాయిదాలు సక్రమంగా చెల్లించిన వారికి..

గతంలో వాయిదాలు సక్రమంగా చెల్లించిన వారికి రుణ పరిమితిని పెంచారు. మొదటి విడతలో రూ.10వేలు, ప్రస్తుతం రూ.15వేలు ఒక్కొక్కరికి ఇచ్చేందుకు, సకాలంలో మంచి రికవరి చేసిన వారికి రూ.20వేల వరకు కూడా రుణం అందించనున్నారు. గతంలో రుణ పొంది చెల్లింపులు చక్కగా చేసిన వారికి రూ.50వేల వరకు అందించేందుకు అధికారులు గుర్తించారు. జిల్లా వ్యాప్తంగా వీధి వ్యాపారులకు రూ.20వేలు, రూ.50వేల పరిమితితో క్రెడిట్‌ కార్డులు కూడా ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు అధికా రులు ప్రకటించారు. ఈ రుణాలతో పాటు కార్డులు కూడా చిరువ్యాపారులకు మరింత దోహదపడుతాయి. ఐదేళ్ల కాలంలో అనేక మంది రుణాలు పొందిన కుటుంబాలు వాటిని సద్వినియోగం చేసుకున్నారు. కాగా 15 రోజులుగా జిల్లాలోని ఆసిఫాబాద్‌, కాగజ్‌న గర్‌లో లోక్‌ కల్యాణ్‌ పేరిట మేళాలు నిర్వహించి ఆసక్తి ఉన్న సభ్యులకు రుణాలు అందిస్తున్నారు. చిరు వ్యాపారులు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఇదో అవకాశంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో లోక్‌ కల్యాణ్‌ పేరిట రుణాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ పథకంలో నిబంధనలు పరిశీలిస్తే వ్యాపారం చిన్న పరిధి కలిగి ఉండాల్సి ఉంటుంది. జీఎస్టీ లేదా వ్యాపార లైసెన్సు సంబంధిత రిజిస్ట్ఱేషన్‌ తప్పని సరి ఉంటుంది. పరిమితమైన ఆదాయంతో వ్యాపారం మొదలై ఒక నిర్ధిష్ట టర్నోవర్‌ను పరిశీ లిస్తారు. ధరఖాస్తును ఆన్‌లైన్‌ పోర్టు ద్వారా చేయాల్సి ఉంటుంది. వడ్డీ రహిత రుణాలిచ్చేందుకు ఈ పథక లక్ష్యం. పొందిన రుణం వ్యాపార విస్తరణ, మెరుగైన సౌకర్యాల కోసం వినియోగించాల్సి ఉంటుంది.

వీధి వ్యాపారులకు ఎంతగానో ఉపయోగం..

- మోతీరాం, మెప్మా జిల్లా మిషన్‌ కోఆర్డినేటర్‌

వీధి వ్యాపారులకు రుణాలిచ్చేందుకు కేంద్ర ప్రభు త్వం లోక్‌ కల్యాణ్‌ పథకం అమలు చేసింది. వచ్చే నెల 2 వరకు ఈ దరఖాస్తులను స్వీకరించాల్సి ఉం టుంది. రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు రుణం ఇచ్చే అవకాశాలున్నాయి. గతంలో తీసుకున్న రుణాలు, చెల్లించిన విధానాన్ని పరిశీలిస్తారు. జిల్లాలో ఐదు వేల మంది వ్యాపారులకు ఈ పథకం వర్తిం చనుంది. వీఽధి వ్యాపారులు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలి.

Updated Date - Sep 21 , 2025 | 11:19 PM