Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేషుడి వద్ద రద్దీ
ABN , Publish Date - Sep 04 , 2025 | 05:18 AM
నిమజ్జనోత్సవం దగ్గర పడుతుండడంతో ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తు న తరలి వస్తున్నారు. బుధవారం ఎక్కడ చూసినా గణపతి వద్దకు...
దర్శన క్యూలైన్లలో తోపులాట.. స్పృహతప్పిన 12 మంది
మహిళలు, వృద్ధులకు ఇబ్బందులు.. ప్రత్యేక దర్శనాలు బంద్
ఖైరతాబాద్, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): నిమజ్జనోత్సవం దగ్గర పడుతుండడంతో ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తు న తరలి వస్తున్నారు. బుధవారం ఎక్కడ చూసినా గణపతి వద్దకు వచ్చే భక్తులే కనిపించారు. ఎంఎంటీఎస్, మెట్రో రైళ్లు వచ్చినపుడు అందులోంచి వందల మంది దిగి గణపతి వద్దకు వస్తుండడం కనిపించింది. వినాయకుడి దర్శనం కోసం ఏర్పాటు చేసిన క్యూలైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. క్యూలైన్లలో రద్దీ విపరీతంగా ఉండడంతో తోపులాట జరిగింది. దర్శనానికి వీఐపీలు వచ్చిన సమయాల్లో క్యూలైన్లలో వస్తున్న భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రద్దీతో పాటు ఎండ ఎక్కువగా ఉండడంతో బుధవారం దాదాపు 12 మంది సోమ్మసిల్లి పడిపోయారు. పిల్లలు, మహిళలు, వృద్ధులు ఇబ్బందులు పడ్డారు. దీంతో పోలీసులు ప్రత్యేక దర్శనాలను నిలిపివేశారు.