Heavy Rainfall Expected in Telangana: తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు
ABN , Publish Date - Aug 27 , 2025 | 02:28 AM
బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా తెలంగాణలో బుధ, గురువారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం...
హైదరాబాద్, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా తెలంగాణలో బుధ, గురువారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం మంచిర్యాల, పెద్దపల్లి, ఆసిఫాబాద్, ములుగు, సిరిసిల్ల, హన్మకొండ, వరంగల్, భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్, జనగాం, మెదక్, కామారెడ్డి, నిర్మల్, నారాయణపేట్, వనపర్తి జిల్లా ల్లో వానలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం సంచాలకులు డాక్టర్ నాగరత్న వెల్లడించారు. హైదరాబాద్‌లో మరో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.