kumaram bheem asifabad- జిల్లాలో భారీ వర్షం
ABN , Publish Date - Aug 28 , 2025 | 11:21 PM
కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో బుధవారం మధ్యాహ్నం ప్రారంభమైన వర్షం గురువారం ఉదయం వరకు కురిసింది. జిల్లాలోని రెబ్బెనలో అత్యధికంగా వర్షపాతం నమోదు అయింది. పలు మండలాల్లో వాగులు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో రాక పోకలు నిలిచి పోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
ఆసిఫాబాద్‌రూరల్, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో బుధవారం మధ్యాహ్నం ప్రారంభమైన వర్షం గురువారం ఉదయం వరకు కురిసింది. జిల్లాలోని రెబ్బెనలో అత్యధికంగా వర్షపాతం నమోదు అయింది. పలు మండలాల్లో వాగులు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో రాక పోకలు నిలిచి పోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని వర్షాపాతానికి సంబంధించి పరిస్థితులపై జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు కలెక్టర్ వెంకటేష్ దోత్రేకు ఫోన్ చేసి ఆరా తీశారు. అధికారులను అప్రమత్తం చేసి ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా చూడాలని ఆదేశాల జారీ చేశారు. జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులైన కుమరం భీం ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతుండడంతో బుధవారం రెండు గేట్లు ఎత్తి నీటిని వదిలిన అధికారులు గురువారం ఉదయం వరకు మూడు గేట్లను మీటర్ మేర ఎత్తి 6,324 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. వట్టివాగు ప్రాజెక్టు కూడా వరద పెరగడంతో నాలుగు గేట్లు ఎత్తి 6,500 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. వాతావరణ శాఖ సూచన హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలో విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తూ కలెక్టర్ వెంకటేష్ దోత్రే ఉత్తర్వులు జారీ చేశారు.
కాగజ్‌నగర్ , (ఆంధ్రజ్యోతి): కాగజ్‌నగర్‌లో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. ఒక వైపు పండుగ వేడుకలు చేసుకునేందుకు కూడా బయటికి పోలేని పరిస్థితి ఏర్పడింది. భారీ వర్షం కురియటంతో వివిధ కాలనీల్లోకి వర్షం నీరు వచ్చింది. అలాగే పెద్దవాగు పరిసరా ప్రాంతాల ప్రజలను రెవిన్యూ అధికారులు అప్రతమత్తం చేశారు.
దహెగాం, (ఆంధ్రజ్యోతి): మండల వ్యాప్తంగా బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. మండల వ్యాప్తంగా 7.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా లోతట్టు ప్రాంతాల్లో పంటలు నీట మునిగాయి. గ్రామ సమీపంలోని లోలెవల్ రోడ్డుడ్యాంలు ఉప్పొంగి ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పంట చేలలోకి వెళ్లిన రైతులు, కూలీలు గంటల తరబడి వేచి చూసి వరద ప్రవాహం తగ్గగానే ఇళ్లకు చేరుకున్నారు. ఎస్సై విక్రమ్ వరద ప్రవాహాన్ని పరిశీలించారు. సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు.
సిర్పూర్(యు), (ఆంధ్రజ్యోతి): మండలంలో గురువారం ఉదయం భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి వాగులు, ఒర్రెలు పొంగిపొర్లాయి.