Share News

Heavy Rainfall:హైదరాబాద్‌లో భారీ వర్షం

ABN , Publish Date - May 25 , 2025 | 05:29 AM

హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసి ప్రధాన రహదారులు జలమయమవ్వడంతో ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. పెద్దపల్లి, ఆసిఫాబాద్‌ వంటి జిల్లాల్లో వర్షం వల్ల ధాన్యం నష్టపోయి, పశువులు మృతి చెందాయి.

Heavy Rainfall:హైదరాబాద్‌లో భారీ వర్షం

పలు ప్రాంతాల్లో రహదారులు జలమయం

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో శనివారం రాత్రి భారీ వర్షం కురిసింది. అరగంటకు పైగా వర్షం పడటంతో రహదారులు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులపై వరద నీరు నిలిచిపోవడంతో బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, మాదాపూర్‌, రాయదుర్గం, హైటెక్‌సిటీ, అమీర్‌పేట ప్రాంతాల్లో ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. పెద్దపల్లి జిల్లా ఓదెలలో శనివారం ఉదయం వరకు 4.3 సెం.మీ వర్షం కురిసింది. ధర్మారంలో 4.2, భోజన్నపేట్‌లో 3.6, రంగంపల్లిలో 3.3 సెం.మీ వాన పడింది. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్‌ యార్డు, అప్పన్నపేట, తదితర ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వడ్లు తడిశాయి. ఎలిగేడు మండలం శివపల్లిలో పశువుల కొట్టంపై పిడుగు పడి నాలుగు ఆవులు మృతి చెందాయి. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో గంటపాటు భారీ వర్షం కురిసింది. గోదావరి రోడ్డులోని పలు వాడల్లో మురికి నీరు ఇళ్లలోకి చేరడంతో స్థానికులు ఇబ్బందిపడ్డారు. ఆసిఫాబాద్‌ జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఆసిఫాబాద్‌ మండలంలోని గుండి పెద్దవాగుపై నిర్మించిన తాత్కాలిక వంతెన వరదకు కొట్టుకుపోయింది. దహెగాం మండలంలో కురిసిన వర్షానికి కొనుగోలు కేంద్రంలోని ధాన్యం తడిసిపోయింది.


ఇవి కూడా చదవండి

Vijayawada Durgamma: దుర్గగుడిలో భక్తుల రద్దీ.. కీలక నిర్ణయం తీసుకున్న EO

Husband And Wife: సెల్‌ఫోన్‌లో పాటలు.. సౌండ్ తగ్గించమన్నందుకు భార్యపై దారుణం..


Updated Date - May 25 , 2025 | 05:29 AM