Share News

kumaram bheem asifabad- భారీ వర్షం

ABN , Publish Date - Aug 13 , 2025 | 11:08 PM

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. గడిచిన 24 గంటల్లో జిల్లా వ్యాప్తంగా 101.1 మీల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం తెల్లవారుజామువరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురువడంతో వాగులు, ఒర్రెలు ఉప్పొంగి ప్రవ హించాయి. కురిసిన భారీ వర్షానికి ఆసిఫాబాద్‌ మండలంలోని గూడెన్‌ఘాట్‌ వాగు ఉధృతంగా వంతెనపై నుంచి వరదనీరు ప్రవహించడంతో సుమారు రెండు గంటలపాటు ఆసిఫాబాద్‌-చిర్ర కుంట గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపో యాయి

kumaram bheem asifabad- భారీ వర్షం
ఆసిఫాబాద్‌ మండలంలోని గూడెన్‌ఘాట్‌ వంతెనను పరిశీలిస్తున్న కలెక్టర్‌, ఎస్పీ

- గ్రామస్థుల రాకపోకలకు అంతరాయం

- నీటిమునిగిన పంటలు

- కుమరం భీం ప్రాజెక్టు ఐదు గేట్ల ఎత్తివేత

ఆసిఫాబాద్‌, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. గడిచిన 24 గంటల్లో జిల్లా వ్యాప్తంగా 101.1 మీల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం తెల్లవారుజామువరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురువడంతో వాగులు, ఒర్రెలు ఉప్పొంగి ప్రవ హించాయి. కురిసిన భారీ వర్షానికి ఆసిఫాబాద్‌ మండలంలోని గూడెన్‌ఘాట్‌ వాగు ఉధృతంగా వంతెనపై నుంచి వరదనీరు ప్రవహించడంతో సుమారు రెండు గంటలపాటు ఆసిఫాబాద్‌-చిర్ర కుంట గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపో యాయి. వాగు ఉధృతిని జిల్లా కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే, ఎస్పీ కాంతిలాల్‌ పాటిల్‌ పరిశీలించి అప్ర మత్తంగా ఉండాలని అధికారులను సూచించా రు. ఆసిఫాబాద్‌ పట్టణంలోని మజీద్‌వాడకు చెందిన ముత్తహీ ర్‌షా ఇంటి ప్రహరీగోడ కూలీపోగా, వరద ప్రవహనికి సెప్టిక్‌ ట్యాంకు కొట్టుకుపోయింది. కుమరంభీం ప్రాజెక్టులోకి 8,333 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరడంతో ఐదు గేట్లు పైకి ఎత్తి 21,254 క్యూసెక్కుల వరద నీటిని అదికారులు కిందికి వదిలారు. దీంతో పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. జిల్లాలో బుధవారం ఉదయం వరకు అత్యధికంగా రెబ్బెనలో 219.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. తిర్యాణిలో 179.8, కాగజ్‌నగర్‌లో 133.6, దహెగాంలో 119.2, కౌటాలలో 112.0, ఆసిఫాబాద్‌లో 115.0, కెరమెరిలో 86.8, వాంకి డిలో 80.6, పెంచికల్‌పేటలో 80.0, సిర్పూర్‌ (టి)లో 74.4, చింతలమానేపల్లిలో 72.2, జైనూ రులో 71.8, సిర్పూర్‌(యూ)లో 61.2, బెజ్జూరులో 58.4, లింగాపూర్‌లో 52.6మిల్లీమీటర్ల వర్షం కురిసింది.

వాంకిడి, (ఆంధ్రజ్యోతి): మండలంలో మంగళ వారం రాత్రి నుంచి ఉదయం 9 గంటల వరకు భారీ వర్షం కురిసింది. దీంతో మండలంలోని చికిలి, ఖమాన, తదితర వాగులు పొంగి పారడంతో రాక పోకలు స్తంభించి పోయాయి. మండలంలోని దుబ్బగూడ గ్రామ సమీపంలోని లో లెవెల్‌ వంతెనపై నుంచి వరద నీరు ప్రవహించడంతో మండల కేంద్రానికి, ఖమాన గ్రామానికి రాక పోకలు స్తంభించాయి.

కెరమెరి, (ఆంధ్రజ్యోతి): మండలంలో భారీ వర్షం కురవడంతో వాగులు, ఒర్రెలు ఉప్పొంగి ప్రవహించాయి. లక్మాపూర్‌ వాగు ఉప్పొంగి ప్రవహించడంతో సుమారు పది గ్రామాల ప్రజలకు మండల కేంద్రానికి రాకపోకలు నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడ్డారు.

చింతలమానేపల్లి, (ఆంధ్రజ్యోతి): ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి దిందా వాగు ఉప్పొం గి ప్రవహిస్తోంది. దీంతో గ్రామం నుంచి బయ టకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. బాబాసాగర్‌, నాయకపుగూడ వాగు, రన్‌వెల్లి-టేకంగూడ ఒర్రెపై ఉన్న లోలెవల్‌ వంతెనపై నీరు ప్రవహి స్తుండడంతో అతి కష్టం మీద ప్రజలు ఒర్రెను దాటారు.

బెజ్జూరు, (ఆంధ్రజ్యోతి): మండలంలోని లో లెవల్‌ వంతెనలు ఉప్పొంగడంతో రాక పోకలు స్తంభించి పోయాయి. మండలంలోని కుశ్నపల్లి, సోమిని గ్రామాల మధ్య రెండు లో లెవల్‌ వంతెనలపై నుంచి భారీగా వరద నీరు పారు తుండడంతో వాగవతల ఉన్న గ్రామాలకు రాక పోకలు నిలిచిపోయాయి. లెవల్‌ వంతెనలను తహసీల్దార్‌ రామ్మోహన్‌, ఎంపీడీవో ప్రవీణ్‌కు మార్‌లు సందర్శించి వాగు ప్రవాహంలో దాట కుండా రక్షణ చర్యలు తీసుకోవాలని అధికారుల కు సూచించారు. లో లెవల్‌ వంతెనలో వద్ద ముళ్ల కంప వేసి రోడ్డును మూసి వేయించారు. వర్షానికి పంట పొలాల్లోవరద నీరు చేరింది.

దహెగాం, (ఆంధ్రజ్యోతి): భారీ వర్షాఆనికి మండలంలోని ఒర్రెలు, పెద్దవాగు, ఎర్రవాగులు, పీపీరావు ప్రాజెక్టు మత్తడి ఉధృంగా ప్రవహిం చింది. ఇట్యాల సమీపంలో కల్వర్టు పై నుంచి, అయిన సమీపంలోని లో లెవల్‌ వంతెనలు ఉధృంగా వరద నీరు పారడంతో కాగజ్‌నగర్‌- దహెగాం మధ్య రాక పోకలు నిలిచి పోయాయి. ఎర్రవాగు వరద నీరు పీకలుగండం- కుంచవెల్లి గ్రామాల మధ్య రహదారిపై పారడంతో రాకపో కలు నిలిచిపోయాయి. పలువురి ఇళ్లల్లోకి వరద నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పెసరికుంట గ్రామంలో ఒక కుటుంబంను సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు తహసీల్దార్‌ మునావర్‌ షరీఫ్‌ తెలిపారు. ఒడ్డుగూడ, గిరివెల్లి, చంద్రపల్లి గ్రామాల్లో విద్యుత్‌ మోటారు ఎర్రవా గు, పెద్దవాగు వరద నీటిలో మునిగి పోయా యి. ఎస్సై విక్రమ్‌ ఆధ్వర్యంలో లో లెవల్‌ వంతె నల వద్ద పోలీసుల పహారా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. దహెగాం మండలం పెసరికుంట గ్రామాన్ని కాగజ్‌నగర్‌ సబ్‌ కలెక్టర్‌ శ్రద్ధశుక్లా సందర్శించారు. పెద్దవాగు ఒడ్డున నివసిస్తన్న ఐదు కుటుంబాలను సీఎస్‌ఐ చర్చికి తరలిం చాలని తహసీల్దార్‌కు సూచించారు.

పెంచికలపేట, (ఆంధ్రజ్యోతి): పెద్దవాగు, బొక్కివాగు, ఉచ్చమల్లవాగులతో పాటు ఒర్రెలు సైతం ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చ్చమల్ల వాగు లో లెవల్‌ వంతెన నుంచి ప్రవహిం చడంతో రెండు గంటల పాటు రాక పోకలు నిలిచి పోయాయి. పెద్దవాగు వరద ఉధృతితో రహదారులపై నీరు చేరడంతో కమ్మర్‌గాం, మురళీగూడ, జిల్లెడ, నందిగామ పరివాహక గ్రామాల్లో వందల ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి. బొక్కివాగు ప్రాజెక్టు మత్తడి ఉధృతంగా ప్రవహంచడంతో మేరేగూడ గ్రామానికి చెందిన పశువులు, పశువుల కాపర్లు ఇబ్బంది పడుతూ మత్తడి దాటారు.

లింగాపూర్‌, (ఆంధ్రజ్యోతి); భారీ వర్షానికి మండలంలోని కిమానాయక్‌తండా వాగు, మోతి పట్టార్‌వాగు, పిట్టాగూడా వాగు, చోర్‌పల్లివాగు, నాగూగుడావాగు, ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో సుమారు మూడు గంటల పాటు పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి ప్రజలు అవస్థలు పడ్డారు.

సిర్పూర్‌(యు), (ఆంధ్రజ్యోతి): మండలంలో బుధవారం ఉదయం సుమారు రెండు గంటలపాటు భారీ వర్షం కురిసింది. దీంతో వాగులు, ఒర్రెలు ఉప్పొంగి ప్రవహించాయి. సిర్పూర్‌(యు), దేవుడుపల్లి గ్రామాల రహదారిపై గల వాగు రోడ్డుడ్యాంపై నుంచి వరద నీరు ప్రవహించింది. రాజుల్‌గూడ, కోడ్డిగూడ, అలీగూడ కల్వర్టులపై నుం చి వరదనీరు ఉధృతంగా ప్రవహించింది. భారీ వర్షాల కారణంగా మండల ప్రజలు అప్రమత్త్తంగా ఉండాలని తహసీల్దార్‌ ప్రహ్లాద్‌, ఎంపీడీవో కృష్ణారావు కోరారు.

సిర్పూర్‌(టి), (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కురు స్తున్న భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాం తాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్‌ రహీముద్దీన్‌, ఎస్సై కమలాకర్‌లు అ న్నారు. బుధవారం సిర్పూర్‌(టి) మండలం డోర్‌పల్లి వాగు లోలెవల్‌ వంతెనపై నుంచి ప్రవహిస్తున్న వరద నీటిని పరిశీలించారు.

Updated Date - Aug 13 , 2025 | 11:08 PM