IAS Officer VS TDP Woman: ఐఏఎస్ వర్సెస్ టీడీపీ మహిళా ఎంపీ
ABN , Publish Date - Sep 15 , 2025 | 06:06 AM
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్, సీఎంవో ఉన్నతాధికారి కార్తికేయ మిశ్రా.. నంద్యాల టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది..
కార్తికేయ మిశ్రా, శబరి మధ్య తీవ్ర వాగ్వాదం
న్యూఢిల్లీ, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్, సీఎంవో ఉన్నతాధికారి కార్తికేయ మిశ్రా.. నంద్యాల టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. గత శుక్రవారం ఢిల్లీలో నూతన ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారంలో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు వచ్చినప్పుడు ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. జన్‌పథ్‌లోని తన నివాసం నుంచి చంద్రబాబు రాష్ట్రపతి భవన్‌కు వెళ్తుండగా.. శబరి ఆయనతో మాట్లాడేందుకు తలుపు దగ్గర నిలుచున్నారు. అక్కడ మీరెందుకని మిశ్రా ఆమెను దురుసుగా ప్రశ్నించినట్లు తెలిసింది. మిశ్రా తీరుపై మనస్తాపానికి గురైన ఆమె.. మంత్రి లోకేశ్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ ఘటన ప్రస్తుతం ఢిల్లీలో హాట్ టాపిక్‌గా మారింది.