ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి
ABN , Publish Date - Oct 09 , 2025 | 11:16 PM
చిన్న ప్పటి నుంచే ప్రతీ ఒక్కరు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కాపాడుకోవడం ముఖ్యమని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె. రవికుమార్ అన్నారు.
- జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె. రవికుమార్
బిజినేపల్లి, ఆక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి) : చిన్న ప్పటి నుంచే ప్రతీ ఒక్కరు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కాపాడుకోవడం ముఖ్యమని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె. రవికుమార్ అన్నారు. మండలంలోని పాలెంలోని ఎస్వీ ప్రభుత్వ జూనియర్ కళాశాల లో గురువారం ప్రపంచ మానసిక వారోత్సవం పురస్కరించుకొని నేషనల్ టోబాకో ఫ్రీ యూత్ క్యాంపెయిన్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు పోగాకు ఉత్పత్తులను వినియోగించడం వల్ల శారీరక, మానసిక ఆరో గ్యంపై వాటి దుష్ప్రభావాల వల్ల విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు నిత్యం యోగా, ధ్యానం చేయడం దినచర్యలో భాగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి సైక్రియా టిస్ట్ డాక్టర్ అంబుజ, పాలెం పీహెచ్‌సీ డాక్టర్ ప్రియాంక, కళాశాల ప్రిన్సి పాల్ స్వామి, రాజగోపాలా చారి, ఏపీవో విజయ్‌కుమా ర్, బాదం రాజేష్, మల్లేష్, హెల్త్ అసిస్టెంట్ గోవర్ధన్, ఏఎన్‌ఎం గజవర్ధనమ్మ, ఆశా కార్యకర్తలు ఉన్నారు.