Aarogyasri: యథావిధిగా ఆరోగ్యశ్రీ సేవలు
ABN , Publish Date - Sep 20 , 2025 | 04:53 AM
రోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో నిలిచిపోయిన ఆరోగ్యశ్రీ సేవలు శనివారం నుంచి పునఃప్రారంభం కానున్నాయి. మంత్రి దామోదర.. శుక్రవారం రాత్రి బంజారాహిల్స్‌లోని...
దామోదర హామీని అంగీకరించిన ఆస్పత్రుల అసోసియేషన్ ప్రతినిధులు
హైదరాబాద్, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో నిలిచిపోయిన ఆరోగ్యశ్రీ సేవలు శనివారం నుంచి పునఃప్రారంభం కానున్నాయి. మంత్రి దామోదర.. శుక్రవారం రాత్రి బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస సముదాయంలో ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రుల అసోసియేషన్ ప్రతినిధులతో చర్చలు జరిపారు. ప్రతినెలా నిధులు విడుదల చేస్తామని, ఇతరత్రా సమస్యలపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. హామీని అంగీకరించిన అసోసియేషన్ ప్రతినిధులు.. శనివారం నుంచి నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ వైద్యసేవలు ప్రారంభిస్తామని ప్రకటించారు. నెట్‌వర్క్ ఆస్పత్రుల నిర్వాహకులను మంత్రి అభినందించారు.