సీఎంఆర్‌ఎఫ్‌తో పేదలకు ఆరోగ్య భద్రత
ABN , Publish Date - Jul 13 , 2025 | 11:36 PM
సీఎంఆర్ ఎఫ్‌తో పేదల ఆరోగ్య భద్ర త చేకూరుతుందని ఎమ్మె ల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు.
- ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి
కల్వకుర్తి, జూలై 13 (ఆంధ్రజ్యోతి) : సీఎంఆర్ ఎఫ్‌తో పేదల ఆరోగ్య భద్ర త చేకూరుతుందని ఎమ్మె ల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు. నిరుపేదలు ఎవ రైనా ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటే వా రికి ఆర్థికంగా ఇబ్బంది కలుగకుండా సీఎం ఆర్‌ఎఫ్ నుంచి ఆర్థిక సహాయం అందజేస్తున్న ట్లు ఆయన పేర్కొన్నారు. ఆదివారం ఎమ్మెల్యే తన నివాసంలో నియోజకవర్గంలోని పలు గ్రా మాలకు చెందిన సీఎంఆర్‌ఎఫ్ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. కల్వకుర్తి నియో జకవర్గంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలం దించాలన్న సంకల్పంతోనే ముఖ్యమంత్రి రేవం త్‌రెడ్డి, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర నరసింహతో వంద పడకల ఆసుపత్రి మంజూ రు చేయించి శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. నిర్ణీత కాలంలో ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తి చేయించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలం దేలా చూస్తానని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్ర మంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.