Share News

సీఎంఆర్‌ఎఫ్‌తో పేదలకు ఆరోగ్య భద్రత

ABN , Publish Date - May 11 , 2025 | 11:14 PM

సీఎంఆర్‌ ఎఫ్‌తో పేదలకు ఆరోగ్య భ ద్రత చేకూరుతుందని కల్వ కుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారా యణరెడ్డి అన్నారు.

సీఎంఆర్‌ఎఫ్‌తో పేదలకు ఆరోగ్య భద్రత
సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ చేస్తున్న కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి

- కల్వకుర్తి ఎమ్మెల్యే నారాయణరెడ్డి

కల్వకుర్తి, మే 11 (ఆంధ్రజ్యోతి) : సీఎంఆర్‌ ఎఫ్‌తో పేదలకు ఆరోగ్య భ ద్రత చేకూరుతుందని కల్వ కుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారా యణరెడ్డి అన్నారు. కార్పొ రేట్‌ ఆసుపత్రిలో వైద్యం చే యించుకున్న పేదలు సీఎం ఆర్‌ఎఫ్‌ను సద్వినియోగం చే సుకోవాలని ఆయన కోరారు. హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే నివాసంలో ఆదివారం నియోజకవ ర్గంలో పలువురికి మంజూరైన సీఎంఆర్‌ఎఫ్‌ చె క్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ కల్వకుర్తి నియోజక వర్గంలో ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేస్తున్నట్లు పేర్కొన్నారు. కల్వకుర్తిలో వంద ప డకల ఆసుపత్రి నిర్మాణాన్ని త్వరలోనే చేపట్టనున్నట్లు తెలిపారు. ఆమనగల్‌ పట్టణం లో 50పడకల ఆసుపత్రి నిర్మాణ పనులు కొన సాగుతున్నాయని తెలిపారు. పేదలకు మెరు గైన వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని తెలిపా రు. కార్యక్రమంలో కల్వకుర్తి ఎంపీడీవో ఎన్‌.వెం కట్రాములు, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - May 11 , 2025 | 11:14 PM