Ponnamall Narendra: నలుగురికి పునర్జన్మనిచ్చిన హెడ్‌కానిస్టేబుల్
ABN , Publish Date - Dec 31 , 2025 | 05:10 AM
సిద్దిపేట జిల్లాలోని చేర్యాల పోలీ్‌సస్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న పొన్నమల్ల నరేందర్ మరణంలోనూ మహాదాతగా నిలిచారు.
బ్రెయిన్‌డెడ్ అవడంతో అవయవదానం చేసిన కుటుంబం
చేర్యాల, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): సిద్దిపేట జిల్లాలోని చేర్యాల పోలీ్‌సస్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న పొన్నమల్ల నరేందర్ మరణంలోనూ మహాదాతగా నిలిచారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్‌డెడ్‌కు గురై నలుగురికి పునర్జన్మ ఇచ్చారు. నరేందర్ ఇటీవల సిద్దిపేట నుంచి చేర్యాలకు విధులకు వస్తున్న క్రమంలో, పట్టణ శివారులో కుక్క అడ్డు వచ్చింది. దీంతో కింద పడిపోయిన నరేందర్ తలకు తీవ్ర గాయమవగా, సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో ఆయన బ్రెయిన్‌డెడ్ అయ్యింది. అయితే, నరేందర్ భౌతికంగా లేకపోయినా, మరొకరి రూపంలో జీవించాలనే ఆకాంక్షతో ఆయన కుంటుం బ సభ్యులు అవయవదానం చేయాలని నిర్ణయించుకున్నారు. ‘జీవన్ దాన్’ సంస్థ ద్వారా నరేందర్ కిడ్నీలు, గుండె, కాలేయాన్ని సేకరించి ప్రాణాపాయంలో ఉన్న నలుగురు వ్యక్తులకు అందజేసి వారికి పునర్జన్మనిచ్చారు. విషయం తెలిసిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ .సజ్జనార్ ఎక్స్‌లో నరేందర్ కుటుంబాన్ని ప్రశంసించారు.