Harish Rao: రేవంత్ పాలనలో పెరిగిన వలసలు
ABN , Publish Date - Oct 17 , 2025 | 02:11 AM
రేవంత్‌రెడ్డి 22నెలల పాలనలో అనూహ్యంగా వలసలు పెరిగాయని మాజీ మంత్రి తన్నీరు హరీ్‌షరావు ఆరోపించారు. గల్ఫ్‌లోని జోర్డాన్‌లో చిక్కుకుని...
హైదరాబాద్, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): రేవంత్‌రెడ్డి 22నెలల పాలనలో అనూహ్యంగా వలసలు పెరిగాయని మాజీ మంత్రి తన్నీరు హరీ్‌షరావు ఆరోపించారు. గల్ఫ్‌లోని జోర్డాన్‌లో చిక్కుకుని స్వగ్రామాలకు తిరిగిరాలేక ఆవేదన చెందుతున్న 12మంది తెలంగాణ కార్మికులకు బీఆర్‌ఎస్ అండగా నిలిచిందన్నారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ద్వారా ప్రయత్నించి కార్మికులను రాష్ట్రానికి తీసుకువస్తున్నట్లు చెప్పారు. జోర్దాన్ బాధిత కార్మికుల ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా వారికోసం జరిపే చెల్లింపులతోపాటు స్వదేశానికి వచ్చేందుకయ్యే విమానటికెట్ల ఖర్చును కూడా తామే భరిస్తున్నట్లు హరీశ్‌రావు చెప్పారు. వారం రోజుల్లో నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి, జగిత్యాల, సిద్దిపేటకు చెందిన 12మంది గల్ఫ్ కార్మికులు తెలంగాణకు చేరుకునేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అన్నివర్గాల ప్రజలను మోసం చేసినట్లుగానే, గల్ఫ్ కార్మికులను కూడా కాంగ్రెస్ మోసం చేసిందని, అభయహస్తం మేనిఫెస్టోలో చెప్పిన గల్ఫ్ కార్మికులు, ఎన్నారైల సంక్షేమబోర్డుపై ఇప్పటికీ అతీగతీలేదని ఆరోపించారు.