Harish Rao Slams Congress: బిల్లులు అడిగితే జైలుకు పంపారు
ABN , Publish Date - Dec 03 , 2025 | 03:49 AM
బిల్లులు అడిగిన గత సర్పంచులను కాంగ్రెస్ ప్రభుత్వం జైలుపాలు చేసిందని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా రిమ్మనగూడలోని...
మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులేవీ?: హరీశ్‌రావు
గజ్వేల్, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): బిల్లులు అడిగిన గత సర్పంచులను కాంగ్రెస్ ప్రభుత్వం జైలుపాలు చేసిందని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా రిమ్మనగూడలోని ఓ హోటల్ వద్ద గజ్వేల్, కుకునూరుపల్లి, జగదేవ్‌పూర్ మండలాలకు చెందిన పలువురు హరీశ్‌సమక్షంలో బీఆర్‌ఎ్‌సలో చేరారు. ఈ కార్యక్రమంలో హరీశ్ మాట్లాడుతూ గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న సర్పంచుల బిల్లుల చెల్లింపు ఏమైందని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలన అధ్వానంగా మారిందని, గ్రామాల్లో పారిశుధ్యం పడకేసిందన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చని, గ్రామాలను అధోగతి పాలు చేసిన కాంగ్రెస్ నాయకులకు, ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని ఆయన ప్రజలను కోరారు.