Harish Rao Tears: హరీశ్ రావే కాదు.. చిన్నారి స్పీచ్ వింటే ఎవరైనా కన్నీరు పెట్టాల్సిందే
ABN , Publish Date - Apr 19 , 2025 | 04:24 PM
ఆ చిట్టిపొట్టి చిన్నారి విద్యార్థిని ఇచ్చిన బహిరంగ స్పీచ్ వింటే, మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత హరీశ్ రావే కాదు, మానవత్వమున్నవారెవరైనా కన్నీరు కార్చాల్సిందే. అదే జరిగింది ఇవాళ
Harish Rao sheds tears: ఆ చిట్టిపొట్టి చిన్నారి విద్యార్థిని ఇచ్చిన బహిరంగ స్పీచ్ వింటే, మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత హరీశ్ రావే కాదు, మానవత్వమున్నవారెవరైనా కన్నీరు కార్చాల్సిందే. అదే జరిగింది ఇవాళ. విద్యార్థులు భవిష్యత్తులో ముందుకెళ్లడానికి, ఉన్నతంగా ఎదగడానికి ప్రోత్సాహాన్ని అందించేలా.. "భద్రంగా ఉండాలి.. భవిష్యత్తులో ఎదగాలి". అనే కార్యక్రమాన్ని సిద్ధిపేటలో ఏర్పాటు చేశారు. పట్టణంలోని మెట్రో గార్డెన్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు హాజరయ్యారు.
ఈ సందర్భంగా అందరు విద్యార్థులతోపాటు సాత్విక అనే ఓ విద్యార్థిని కూడా మైక్‌లో మాట్లాడింది. అయితే, ఆ చిన్నారి కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పిన మాటలు, ఆమె తీసుకున్న నిర్ణయాలు.. ఆమె మాటల్లోనే వింటే ఎలాంటి వారికైనా కన్నీళ్లు కారిపోతాయి. అదే ఇవాళ మాజీ మంత్రి హరీశ్ రావు కూడా స్వయంగా అనుభవించారు. ఇంతకీ ఆ చిన్నారి తల్లి ఏమందంటే.. " అందరికీ నమస్కారం.. నేను ఇక్కడికి రావడానికి కారణం మా మమ్మీ. నేను రెండవ తరగతిలో ఉన్నప్పుడే మా నాన్న చనిపోయాడు. మా మమ్మీ కష్టపడి స్కూల్ ఫీజు కడుతూ నన్ను చదివిస్తోంది. ఇప్పటి నుంచి మా మమ్మీని మంచిగా చూసుకుంటాను. మా మమ్మీకి మంచి పేరు తీసుకొస్తాను. మా మమ్మీకి, డాడీ.. వాళ్ల పేర్లకు వాల్యూ తెచ్చేలా నడుచుకుంటాను. ధన్యవాదాలు." అంటూ ఏడుస్తూనే మాట్లాడింది ఆ చిన్నారి.
ఆ దృశ్యాన్ని చూసి హరీష్ రావు చలించిపోయారు. ఆ చిన్న పాపను దగ్గరకి తీసుకుని ఓదార్చారు. ఈ క్రమంలో ఆయన కంటి నుంచీ కన్నీళ్లు కారిపోయాయి. చిన్నారి మాటలకి అక్కడున్న వాళ్లంతా చలించి పోయారు.

ఇవి కూడా చదవండి:
నిరాశ్రయులకు టిప్యాడ్ ఆధ్వర్యంలో ఫుడ్ డ్రైవ్
డల్లాస్ ఈద్ మిలాప్ వేడుకల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి డా.పెమ్మసాని
హంగ్‌కాంగ్‌లో వైభవంగా శ్రీ విశ్వావసు నామ ఉగాది వేడుకలు