Share News

Harish Rao: అబద్ధాల హరీశ్‌కు గల్ఫ్‌ కార్మికుల చేతిలో చెప్పు దెబ్బలే..: ఈరవత్రి

ABN , Publish Date - Oct 12 , 2025 | 03:35 AM

గల్ఫ్‌ సంక్షేమ కార్యక్రమాలపై అబద్ధాలాడుతున్న హరీశ్‌రావును గల్ఫ్‌ కార్మికులు చెప్పుతో కొట్టే పరిస్థితి ఏర్పడిందని రాష్ట్ర ఖనిజాభివృద్ధి ...

Harish Rao: అబద్ధాల హరీశ్‌కు గల్ఫ్‌ కార్మికుల చేతిలో చెప్పు దెబ్బలే..: ఈరవత్రి

హైదరాబాద్‌/హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): గల్ఫ్‌ సంక్షేమ కార్యక్రమాలపై అబద్ధాలాడుతున్న హరీశ్‌రావును గల్ఫ్‌ కార్మికులు చెప్పుతో కొట్టే పరిస్థితి ఏర్పడిందని రాష్ట్ర ఖనిజాభివృద్ధి కార్పొరేషన్‌ చైౖర్మన్‌ ఈరవత్రి అనిల్‌ అన్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో రాష్ట్రానికి చెందిన సుమారు 2 వేల మంది గల్ఫ్‌ దేశాల్లో మృత్యువాతపడితే ఒక్క కుటుంబానికి రూపాయి ఎక్స్‌గ్రేషియా ఇవ్వలేదని విమర్శించారు. శనివారం గాంధీభవన్‌లో ఎన్నారై అడ్వైజరీ కమిటీ చైర్మన్‌ బీఎం వినోద్‌కుమార్‌తో కలిసి ఈరవత్రి మీడియాతో మాట్లాడారు. గల్ఫ్‌ కార్మికుల పాలిట కేసీఆర్‌ ఒక నరరూప రాక్షసుడైతే.. కేటీఆర్‌, కవిత, హరీశ్‌లు పిల్ల రాక్షసులని అభివర్ణించారు. గల్ఫ్‌ కార్మికుల సంక్షేమానికి ఒక్క రూపాయి కేటాయించని నాటి ఆర్థిక మంత్రి హరీశ్‌.. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని వారి గురించి మాట్లాడుతున్నాడని వినోద్‌కుమార్‌ మండిపడ్డారు. ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది నియామకం కోసం ప్రభుత్వమే ప్రత్యేకంగా కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందిని ప్రైవేట్‌ ఏజెన్సీలు నియమించడం వల్ల శ్రమ దోపిడీకి గురవుతున్నారని పేర్కొన్నారు. కాగా, గాంధీ జయంతి రోజు మహాత్మా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీ నటుడు శ్రీకాంత్‌ అయ్యంగార్‌పై కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని కోరుతూ కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Updated Date - Oct 12 , 2025 | 03:35 AM