Harish Rao: గ్రూప్-1పై సిటింగ్ జడ్జితో విచారణ జరిపించాలి
ABN , Publish Date - Sep 14 , 2025 | 05:23 AM
గ్రూప్-1 పరీక్షల్లో అవకతవకలపై సిటింగ్ జడ్జితో విచారణ జరిపించాలని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఉద్యోగానికి మంత్రులు రూ.లక్షల్లో లంచం అడిగారని విద్యార్థులు చెబుతున్నారు: హరీశ్ రావు
సిద్దిపేట సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): గ్రూప్-1 పరీక్షల్లో అవకతవకలపై సిటింగ్ జడ్జితో విచారణ జరిపించాలని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రూప్-1 ఉద్యోగానికి మంత్రులు, అధికారులు రూ.లక్షల్లో లంచం అడిగారంటూ నిరుద్యోగులు చెబుతున్నారని తెలిపారు. శనివారం సిద్దిపేటలో నిర్వహించిన మెగా జాబ్‌మేళా కార్యక్రమాన్ని హరీశ్‌రావు ప్రారంభించి మాట్లాడారు. పరీక్షలు ఇంత నిర్లక్ష్యంగా నిర్వహిస్తారా? అంటూ హైకోర్టు ప్రభుత్వంపై మొట్టికాయలు వేసిందన్నారు. ప్రభుత్వం తప్పును సరిదిద్దుకోకుండా అప్పీల్‌కు వెళతామనడం మూర్ఖత్వమే అవుతుందని ఆయన విమర్శించారు.