Harish Rao Demands: మధ్యాహ్నభోజన కార్మికులకు వేతనాలు, బిల్లులు చెల్లించాలి
ABN , Publish Date - Sep 13 , 2025 | 04:46 AM
మధ్యాహ్న భోజన కార్మికుల వేతనాలు, పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు...
హైదరాబాద్, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): మధ్యాహ్న భోజన కార్మికుల వేతనాలు, పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. మధ్యాహ్నభోజన పథకం కార్మికులపట్ల రేవంత్‌రెడ్డి సర్కార్ కఠినంగా వ్యవహరిస్తున్న తీరు అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని వరంగల్‌కు చెందిన మధ్యాహ్న భోజన కార్మికులు హరీశ్‌రావును హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. కార్మికులు ఆందోళన చెందొద్దని, బీఆర్‌ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కాగా, యూరియా కోసం రైతులు పడుతున్న కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న జర్నలిస్టులపై కేసులు పెడతారా? అని ఎక్స్ వేదికగా హరీశ్‌రావు ప్రశ్నించారు.