Former minister Harish Rao: ఆర్థిక నిర్వహణలో సర్కార్ విఫలం
ABN , Publish Date - Oct 15 , 2025 | 04:08 AM
తెలంగాణ తిరోగమనం వైపు పయనిస్తోందని, అనాలోచిత విధానాల కారణంగా.. రాష్ట్ర ఆర్థిక నిర్వహణలో రేవంత్ సర్కార్ విఫలం అయిందని...
హైదరాబాద్, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ తిరోగమనం వైపు పయనిస్తోందని, అనాలోచిత విధానాల కారణంగా.. రాష్ట్ర ఆర్థిక నిర్వహణలో రేవంత్ సర్కార్ విఫలం అయిందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోందని, మూడునెలలు నెగిటివ్ ద్రవ్యోల్బణం వారిపాలన వైఫల్యానికి నిదర్శనమని మంగళవారం ఎక్స్ వేదికగా ఆయన పేర్కొన్నారు. భారతదేశ రిటైల్ ద్రవ్యోల్బణం 1.54శాతం నమోదైతే, తెలంగాణలో నెగిటివ్ ద్రవ్యోల్బణం నమోదవుతుండటం మందగించిన ఆర్థిక పతనానికి సంకేతమన్నారు. బుల్డోజర్ విధానాలు, ప్రతీకార రాజకీయాలు చతికిలపడిపోతున్న రాష్ట్ర ఆర్థిక వృద్ధిపై రేవంత్‌రెడ్డి ఇప్పటికైనా దృష్టిసారించాలని సూచించారు.