Harish Rao Criticizes: కేంద్రాన్ని ప్రశ్నించడంలో రేవంత్ విఫలం
ABN , Publish Date - Dec 01 , 2025 | 05:48 AM
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నించడంలో సీఎం రేవంత్‌రెడ్డి విఫలమయ్యారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు...
తెలంగాణ రైతులపై బీజేపీకి ప్రేమలేదు: హరీశ్‌రావు
హైదరాబాద్/నారాయణఖేడ్, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నించడంలో సీఎం రేవంత్‌రెడ్డి విఫలమయ్యారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ ఆధ్వర్యంలో కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన పలువురు బీజేపీ నాయకులు ఆదివారం హైదరాబాద్‌లోని హరీశ్‌రావు నివాసంలో బీఆర్‌ఎ్‌సలో చేరారు. ఈ సందర్భంగా, సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాలు, హక్కులను కాపాడటంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసిందని విమర్శించారు. 8 మంది బీజేపీఎంపీలున్నా రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజీ తేలేకపోయారన్నారు. ఉత్తరాది రాష్ట్రాల రైతులకు ప్రయోజనం కలిగించడం ఉన్న ప్రేమ.. తెలంగాణ రైతాంగం పట్ల బీజేపీకి లేదని.. అందుకే కేంద్రం గోధుమలకు ఇచ్చిన మద్దతు ధరను వరికి కల్పించడం ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో రైతులకు అడుగడుగునా ఇబ్బందులు తప్పడం లేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కోటి 46 లక్షల ఎకరాలకు రైతు భరోసా ఇవ్వాల్సి ఉన్నప్పటికీ, 70 లక్షల ఎకరాలకు ఎగ్గొట్టేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. సంగారెడ్డి జిల్లాలోని బీడు భూములను సస్యశ్యామలం చేయడం కోసం గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పథకాలను ప్రారంభించకుంటే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు.