Harish Rao: దౌత్యవైఫల్యం వల్లే అమెరికాలో ఇబ్బందులు: హరీశ్
ABN , Publish Date - Sep 22 , 2025 | 06:42 AM
కేంద్ర ప్రభుత్వ దౌత్యవైఫల్యం కారణంగానే అమెరికాలో ఉండే భారతీయులు తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తోందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు.
హైదరాబాద్, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వ దౌత్యవైఫల్యం కారణంగానే అమెరికాలో ఉండే భారతీయులు తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తోందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. హెచ్-1బీ వీసా ఫీజుల పెంపు, కార్మిక-ఇంటెన్సివ్ రంగాలలో ఇటీవల 25ు సుంకాల పెరుగుదల వంటివి కేంద్రం వైఫల్యాన్ని ప్రతిబింబిస్తున్నాయని ఆదివారం ఎక్స్ వేదికగా ఆయన పేర్కొన్నారు. కాగా, బతుకమ్మ పండుగ సందర్భంగా.. రాష్ట్రంలోని ఆడబిడ్డలకు హరీశ్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. ఎంగిలిపూల బతుకమ్మ రాష్ట్ర ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు నింపాలని ఆయన ఆకాంక్షించారు.