Share News

Harish Rao: వ్యవసాయమే కాదు.. వైద్యసేవల్లోనూ కాంగ్రెస్‌ సర్కారు విఫలం

ABN , Publish Date - Aug 27 , 2025 | 02:23 AM

వ్యవసాయరంగమే కాదు.. ప్రాథమిక వైద్యసేవలు అందించడంలోనూ కాంగ్రెస్‌ సర్కార్‌ పూర్తి గా విఫలమైందని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. వైద్య సేవలు అందించడంలో...

Harish Rao: వ్యవసాయమే కాదు.. వైద్యసేవల్లోనూ కాంగ్రెస్‌ సర్కారు విఫలం

  • పాలమూరు రైతు మరణం ప్రభుత్వ హత్యే: హరీశ్‌

హైదరాబాద్‌, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి):వ్యవసాయరంగమే కాదు.. ప్రాథమిక వైద్యసేవలు అందించడంలోనూ కాంగ్రెస్‌ సర్కార్‌ పూర్తి గా విఫలమైందని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. వైద్య సేవలు అందించడంలో ప్రభుత్వ ఆస్పత్రులు చూపిన నిర్లక్ష్యవైఖరి రైతు మరణానికి కారణమైందని, ఇది ప్రభుత్వ హత్య అని మంగళవారం ఎక్స్‌లో ఆరోపించారు. అప్పుల బాధతో మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర ్లమండలం ఈర్లపల్లిలో రైతు రవినాయక్‌ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తనను కలిచివేసిందన్నారు. రైతులను నిరాశలోకినెట్టి, జీవితంలోనూ మరణంలోనూ వారికి గౌరవం లేకుండా చేసిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Aug 27 , 2025 | 02:23 AM