Share News

Former minister Harish Rao: 50 వేల కోట్ల విద్యుత్తు కుంభకోణానికి తెరలేపారు

ABN , Publish Date - Nov 27 , 2025 | 04:27 AM

కాంగ్రెస్‌ సర్కారు తాజాగా రూ.50 వేల కోట్ల విద్యుత్తు కుంభకోణానికి తెరలేపిందని, ఇందులో 30-40శాతం మేర కమీషన్లు దండుకునేందుకు సీఎం, మంత్రులు వ్యూహం పన్నారని బీఆర్‌ఎస్‌ నేత...

Former minister Harish Rao: 50 వేల కోట్ల విద్యుత్తు కుంభకోణానికి తెరలేపారు

  • రామగుండం, పాల్వంచ, మక్తల్‌ పవర్‌ ప్లాంట్లలో భారీ అవినీతి

  • వాటాల పంపకాల కోసమే క్యాబినెట్‌ సమావేశాల నిర్వహణ

  • తెలంగాణ రాష్ట్రాన్ని అరాచకాలకు కేంద్రంగా మారుస్తున్నారు: హరీశ్‌

హైదరాబాద్‌, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ సర్కారు తాజాగా రూ.50 వేల కోట్ల విద్యుత్తు కుంభకోణానికి తెరలేపిందని, ఇందులో 30-40శాతం మేర కమీషన్లు దండుకునేందుకు సీఎం, మంత్రులు వ్యూహం పన్నారని బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. రేవంత్‌ రెడ్డి పాలన అవినీతి కంపుతో గాడి తప్పిందని విమర్శించారు. విధానపరమైన నిర్ణయాల కోసం నిర్వహించాల్సిన క్యాబినెట్‌ సమావేశాలను కాంగ్రెస్‌ సర్కారు వాటాల పంపకాల కోసమే నిర్వహిస్తోందని ఆరోపించారు. తెలంగాణను కాంగ్రెస్‌ ప్రభుత్వం అరాచకాలకు కేంద్రంగా మారుస్తోందని, రేవంత్‌ నిర్ణయాల్లో ప్రజాప్రయోజనాలకన్నా ఆయన స్వప్రయోజనాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని విమర్శించారు. రేవంత్‌ ఏం మాట్లాడినా, ఏం చేసినా దాని వెనుక కమీషన్లు, స్కామ్‌లు ఉంటాయని మండిపడ్డారు. రూ.5లక్షల కోట్ల భూ కుంభకోణాన్ని ఇటీవల తమ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ బయటపెట్టినా.. ప్రభుత్వం దానిపై సమాధానం కూడా చెప్పలేదన్నారు. బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో బుధవారం హరీశ్‌ మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న థర్మల్‌ విద్యుత్తును 40శాతానికి తగ్గిస్తామని విద్యుత్తు పాలసీ కాపీలోనే పేర్కొన్నారని, మొన్నటిదాకా థర్మల్‌ విద్యుదుత్పత్తి అవసరంలేదన్నవారే ఇప్పుడు థర్మల్‌ ప్రాజెక్టు అంశాన్ని ఎందుకు తెరమీదకు తెచ్చారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.


బీఆర్‌ఎస్‌ నేతలను భయపెట్టే ప్రయత్నం

రామగుండం, పాల్వంచ, మక్తల్‌ పవర్‌ ప్లాంట్లలో భారీగా అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ మూడు చోట్ల 2400 మెగావాట్ల థర్మల్‌ విద్యుత్తు ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు రూ.50 వేలకోట్లు అవసరం అని, అందులో రూ.10వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం అడ్వాన్సుగా చెల్లించాల్సి ఉంటుందన్నారు. మిగతా రూ.40 వేలకోట్లను అప్పు రూపంలో ఎక్కడినుంచి తెస్తారని ప్రశ్నించారు. మంగళవారం క్యాబినెట్‌ భేటీలో రామగుండం, పాల్వంచ, మక్తల్‌లో 800 మెగావాట్ల థర్మ ల్‌ విద్యుత్తు ప్రాజెక్టుకు సంబంధించిన నిర్ణయం తీ సుకున్నారన్నారు. మెగావాట్‌ ఉత్పత్తికి 12.23 కోట్ల ఖర్చుతో మొత్తం 2400 మెగావాట్లు ఉత్పత్తి చేసేందుకు ఇప్పటికే ఎన్టీపీసీ డీపీఆర్‌ సిద్ధంచేసిందని.. అదే సమయంలో మెగావాట్‌ ఉత్పత్తికి 14కోట్లు అవుతాయని జెన్‌కో డీపీఆర్‌లో పేర్కొందని.. అప్పుడు ఎవరు తక్కువ ధరకు కోట్‌చేస్తే.. వారికి ప్రాజెక్టు అప్పగించాల్సి ఉంటుందన్నారు. అలా కా కుండా రేవంత్‌రెడ్డి భారీవ్యయంతో నిర్మించబోయే పవర్‌ ప్లాంట్‌ కాస్ట్‌ పర్‌ మెగావాట్‌కు రూ.14కోట్ల చొప్పున నిర్ణయించినట్లు తెలుస్తోందన్నారు. నల్లగొండ జిల్లా దామరచర్లలో 4వేల మెగావాట్ల పవర్‌ ప్లాంట్‌ుకు అప్పట్లో కేసీఆర్‌ సంకల్పిస్తే.. తమ ప్రాంతాన్ని కాలుష్య కాసారంగా మా రుస్తున్నారని, తాము అధికారంలోకి వస్తే ఆ ప్రాజెక్టును ఆపేస్తామని నాడు ప్రతిపక్షంలో ఉన్న, ఇప్పటి మంత్రి కో మటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారని గుర్తుచేశారు. ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వమే థర్మల్‌ ప్రాజెక్టు ఏర్పాటుకు సిద్ధమవుతుంటే ఎందుకు మాట్లా డంలేదో కోమటిరెడ్డి చెప్పాలని ప్రశ్నించారు. కాంగ్రె స్‌ సర్కారు దోపిడీ, స్కామ్‌లను తాము బయపటపెడుతున్నప్పుడల్లా.. కేసులు వేస్తామని, జైల్లో పెడతామంటూ బీఆర్‌ఎస్‌ నేతలను భయపెట్టే ప్రయ త్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - Nov 27 , 2025 | 04:27 AM