Share News

Former minister Harish Rao: 6 గ్యారెంటీల్లాగానే రేవంత్‌ బీసీ రిజర్వేషన్ల డ్రామా

ABN , Publish Date - Oct 10 , 2025 | 04:12 AM

అధికారం కోసం ఆరుగ్యారెంటీల హామీల్లాగానే..బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై కాంగ్రెస్‌ డ్రామాలాడుతోందని మాజీ మంత్రి హరీశ్‌ రావు ఆరోపించారు. మాయమాటలు చెప్పి అధికారంలోకి...

Former minister Harish Rao: 6 గ్యారెంటీల్లాగానే రేవంత్‌ బీసీ రిజర్వేషన్ల డ్రామా

మాజీమంత్రి తన్నీరు హరీశ్‌రావు

అధికారం కోసం ఆరుగ్యారెంటీల హామీల్లాగానే.. బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై కాంగ్రెస్‌ డ్రామాలాడుతోందని మాజీ మంత్రి హరీశ్‌ రావు ఆరోపించారు. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌.. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అదేవిధంగా లబ్ధి పొందాలని చేసిన కుట్రలు పటాపంచలయ్యాయని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రిజర్వేషన్లకు చట్టబద ్ధత కల్పించడం కోసం కేంద్రంతో కొట్లాడాల్సిన రేవంత్‌రెడ్డి, గల్లీలో కొట్లాడుతున్నట్లు 22 నెలలుగా డ్రామాలు చేశారు తప్ప.. ఏనాడూ చిత్తశుద్ధి ప్రదర్శించలేదని ఆయన విమర్శించారు. తూతూ మంత్రంగా ఓ జీవో ఇచ్చి కొత్త నాటకానికి తెరతీశారని అన్నారు. రిజర్వేషన్ల కోసం పోరాటంలో అఖిలపక్షాలను భాగస్వామ్యం చేయాలని, ఢిల్లీ వేదికగా యుద ్ధ భే రి మోగించాలని పేర్కొన్నారు. బీసీలపట్ల కాంగ్రెస్‌ పార్టీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్‌లో చట్టం చేయించి, షెడ్యూల్‌ 9లో చేర్చాలని హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. చెల్లని జీవో తెచ్చి సీఎం రేవంత్‌ రెడ్డి బీసీలను మోసగించారని బీఆర్‌ఎస్‌ నేతలు గంగుల కమలాకర్‌, శ్రీనివాస్‌ గౌడ్‌, కేవీ వివేకానంద ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ఉదే ్దశపూర్వకంగానే చట్టపరమైన లొసుగులు సృష్టించి స్థానిక ఎన్నికలు నిలిచిపోయేలా చేశారని మండిపడ్డారు.

Updated Date - Oct 10 , 2025 | 04:12 AM