kumaram bheem asifabad- ఘనంగా బాలల దినోత్సవం
ABN , Publish Date - Nov 14 , 2025 | 10:08 PM
జిల్లాలో శుకవ్రారం బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆసిఫాబాద్ మండలంలోని తుంపల్లి ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో డీసీపీవో మహేష్ హాజరై కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు నరహరి, కార్యదర్శి దేవిక, బాల రక్ష భవన్ సిబ్బంది శ్రావణ్‌కుమార్, చంద్రశేఖర్, జమున, బాల ప్రవీణ్‌కుమార్, ఝాన్సీరాణి, పితాంబర్, వెంకటేశ్వర్లు నవీన్‌కుమార్, తిరుపతి, షూర్ ఎన్జీవో కో ఆర్డినేటర్ సంతోష్‌కుమార్, ప్రభు, ఉపాధ్యాయులు శంకర్ తదితరులు పాల్గొన్నారు.
ఆసిఫాబాద్‌రూరల్, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో శుకవ్రారం బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆసిఫాబాద్ మండలంలోని తుంపల్లి ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో డీసీపీవో మహేష్ హాజరై కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు నరహరి, కార్యదర్శి దేవిక, బాల రక్ష భవన్ సిబ్బంది శ్రావణ్‌కుమార్, చంద్రశేఖర్, జమున, బాల ప్రవీణ్‌కుమార్, ఝాన్సీరాణి, పితాంబర్, వెంకటేశ్వర్లు నవీన్‌కుమార్, తిరుపతి, షూర్ ఎన్జీవో కో ఆర్డినేటర్ సంతోష్‌కుమార్, ప్రభు, ఉపాధ్యాయులు శంకర్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని వట్టివాగు దిశ మోడల్ పాఠశాలలో బాలల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు అలాగే సెయింట్ మేరీ పాఠశాలలో బాలల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి యువరాజ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో పీఎంఎంఆర్ సీఏసీఎంఓ ఉద్దవ్, ఎస్‌సీఆర్పీలు రవీందర్, అనంత్, మాదవ్‌రావ్, తుకారాం, సురష్, శ్యామల, సిస్టర్ లిబిన్, కరస్పాడెంట్ లిల్లీ పాల్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
చింతలమానేపల్లి, (ఆంధ్రజ్యోతి): మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో శుక్రవారం బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నెహ్రు చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
రెబ్బెన, (ఆంధజ్యోతి): బాల్యం ఎంతో అపురూపమైనదని ఉజ్వల భవిష్యత్ నిర్మాణానికి పునాధి వంటిదని బెల్లంపల్లి ఏరియా జీఎం విజయభాస్కర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం బెల్లంపల్లి ఏరియాలోని గోలేటి సింగరేణి ఉన్నత పాఠశాలలో నిర్వహించిన బాలల దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ప్రముఖుల వేషధారణతో విద్యార్థులు అలరించారు. కార్యక్రమంలో అధికారులు నరేందర్, రాజమల్లు, కృష్ణమూర్తి, ఉజ్వల్‌కుమార్ బెహారా, మదీనా భాషా, జ్ఞానేశ్వర్, రవికుమార్, కరస్పాండెంట్ శ్రీనివాస్, ప్రధానోపాధా యుడు రవితేజ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
సిర్పూర్(యు), (ఆంధ్రజ్యోతి): మండలంలోని ఆయా పాఠశాలల్లో బాలల దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. మహగాం ఆశ్రమ పాఠశాలతో పాటు సిర్పూర్(యు) ఎంపీపీ పాఠశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పలు పాఠశాలల్లో డ్రాయింగ్, వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు.కార్యక్రమంలో ఎంఈవో కుడ్మత సుధాకర్, ప్రధానోఉపాధ్యాయుడు ఆత్రం రాంబాయి, ఆత్రం దత్తు, అనక దేవేందర్, ఉర్వేత మోహన్ పాల్గొన్నారు.
జైనూర్, (ఆంధ్రజ్యోతి): ఆశ్రమోన్నత పాఠశాలల్లో గిరిజన విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నామని పీజీ హెచ్‌ఎం పార్వాతీబాయి అన్నారు. స్థానిక బాలికల ఆశ్రమోన్నత పాఠశాలలో శుక్రవారం బాల దినోత్సవం సందర్భంగా పోషకులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ ఏడాది పదో తరగతి విద్యార్థులు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యేలా ఇప్పటి నుంచే ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని చెప్పారు. విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు ద్రౌపది బాయి, పోషకులు తదితరులు పాల్గొన్నారు.
లింగాపూర్, (ఆంధ్రజ్యోతి): మండలంలోని జిల్లా పరిషత్, కస్తూర్బాగాంధీ పాఠశాల ల్లో బాలల దినోత్సవం నిర్వహించారు. విద్యార్థులు ఆటలతో సందడి చేశారు. కార్యక్రమంలో ఆయా పాఠశాలల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.