Share News

Kalvakuntla Kavita: చేనేత కార్మికుల బతుకులు దయనీయం

ABN , Publish Date - Nov 24 , 2025 | 04:16 AM

రాష్ట్రంలో చేనేత కార్మికుల బతుకులు దయనీయంగా ఉన్నాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు.....

Kalvakuntla Kavita: చేనేత కార్మికుల బతుకులు దయనీయం

కొత్తకోట, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో చేనేత కార్మికుల బతుకులు దయనీయంగా ఉన్నాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. వనపర్తి జిల్లా కొత్తకోటలోని వీవర్స్‌ కాలనీలో ఆదివారం పర్యటించిన ఆమే.. చేనేత కార్మికుల కుటుంబాలతో మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకున్నారు. నేతన్నలు ఎంతో నైపుణ్యం, కళాత్మకతతో చీరలు తయారు చేస్తున్నా.. వారి ఉత్పత్తులను మార్కెట్‌లో నేరుగా అమ్ముకునే పరిస్థితి లేదని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా వ్యాపారులపై ఆధారపడి జీవనం సాగించాల్సి వస్తోందన్నారు.

Updated Date - Nov 24 , 2025 | 04:16 AM