20న హైదరాబాద్‌లో చేనేత కార్మికుల ధర్నా
ABN , Publish Date - Nov 10 , 2025 | 12:14 AM
చేనేత రంగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని, దీనికి నిరసనగా ఈ నెల 20న హైదరాబాద్‌లోని చేనేత కమిషనర్ కార్యాలయం ఎదుట నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు గుర్రం నర్సింహ, ప్రధాన కార్యదర్శి గుండు వెంకట్‌నర్సు పిలుపునిచ్చారు.
వలిగొండ, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): చేనేత రంగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని, దీనికి నిరసనగా ఈ నెల 20న హైదరాబాద్‌లోని చేనేత కమిషనర్ కార్యాలయం ఎదుట నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు గుర్రం నర్సింహ, ప్రధాన కార్యదర్శి గుండు వెంకట్‌నర్సు పిలుపునిచ్చారు. ఆదివారం మండలకేంద్రంలో కరపత్రాలు ఆవిష్కరిం చారు. నూలు, రంగులు, ముడిసరుకులపైనే కాకుండా నేసిన దుస్తుల కూడా జీఎస్టీ పేరుతో పన్నులు వేసి పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం చేనేత రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందని విమర్శించారు. కార్యక్రమంలో గర్దాసు నర్సింహ, వనం ఉపేందర్, దొంత శంకరయ్య, అయిటిపాముల కుమార్, బోడ ఈశ్వర్, గుంటి రమేష్, శేఖర్ ఉన్నారు.