-వెండి, బంగారం అమ్మకాల్లో చేతివాటం..?
ABN , Publish Date - Oct 15 , 2025 | 11:09 PM
బంగారం, వెండి అమ్మకాల్లో కొందరు వ్యాపారులు అక్రమ మార్గా న్ని ఎంచుకుంటున్నారు. ప్రజలకు బంగారం, వెండి ఆ భరణాలపై ఉన్న మక్కువను క్యాష్ చేసుకునేందుకు కొత్త పుంతలు తొక్కుతున్నారు. అసలైన సరుకు పేరు తో ప్రజలకు నకిలీ వస్తువులు అంటగడుతూ నిలువు నా మోసగిస్తున్నారు.
-హాల్‌మార్క్ పేరుతో బంగారం విక్రయాలు
-ప్యూరిటీ పేరిట గిల్టు వెండి నగల తయారీ
-అనుమతులు లేకుండానే ముద్రలు వేస్తున్న వైనం
-అక్రమ మార్గంలో కోట్లు గడిస్తున్న వ్యాపారులు
మంచిర్యాల, అక్టోబర్ 15 (ఆంధ్రజ్యోతి): బంగారం, వెండి అమ్మకాల్లో కొందరు వ్యాపారులు అక్రమ మార్గా న్ని ఎంచుకుంటున్నారు. ప్రజలకు బంగారం, వెండి ఆ భరణాలపై ఉన్న మక్కువను క్యాష్ చేసుకునేందుకు కొత్త పుంతలు తొక్కుతున్నారు. అసలైన సరుకు పేరు తో ప్రజలకు నకిలీ వస్తువులు అంటగడుతూ నిలువు నా మోసగిస్తున్నారు. హాల్‌మార్క్, ప్యూరిటీ పేరుతో అ నుమతులు లేకుండా ముద్రలు తయారు చేస్తూ బం గారు, వెండి బిస్కెట్లపై ముద్రించడమేగాక వాటిని ప్ర జలకు విక్రయిస్తూ కోట్లకు పడగలెత్తుతున్నారనే ఆరో పణలు వినిపిస్తున్నాయి. ఏది అసలో, ఏది నకిలిదో తె లియని ప్రజలు వాటిని కొనుగులు చేస్తూ నిలువునా మోసపోతున్నారు. గతంలో సైతం జిల్లాలో ఈ తతం గం చోటు చేసుకోగా, పోలీసులు కొరఢా ఝళిపించ డంతో అవినీతి దందా నిలిచిపోయింది. అయితే ఇటీవ ల కొన్ని చోట్లా మళ్లీ గుట్టు చప్పుడు కాకుండా అక్రమ దందాను నిర్వహిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
హాల్‌మార్క్ నగలంటూ దోపిడీ...
హాల్‌మార్క్ పేరుతోనూ వినియోగదారుల జేబులకు చిల్లులు పెడుతున్నట్లు బాహాటంగా ప్రచారం జరుగు తోంది. గతంలో చెన్నూరు కేంద్రంగా ఈ హాల్‌మార్క్ దందా యథేచ్ఛగా సాగింది. చెన్నూరులో ప్రత్యేకంగా ఓ బంగారు బిస్కెట్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసి, ఒడిశా నుంచి నిపుణున్ని రప్పించి, పాత బంగారాన్ని కరిగిస్తూ అందులో కల్తీ కలిపి బిస్కెట్ల రూపంలో త యారు చేస్తున్న విషయం పోలీసులకు ఉప్పందగా, దా డులు జరిపి అక్రమ దందాకు చెక్ పెట్టారు. బ్రాండెడ్ కంపెనీలను పోలి ఉన్న అచ్చులతో బిస్కెట్లు తయారు చేస్తుండగా, అసలు బంగారం కంటే రూ. 3 వేల వర కు తక్కువ రేట్లకు విక్రయిస్తున్న విషయం విచారణలో తేలింది. దీంతో అక్కడ బంగారం కొనుగోలు చేసేం దుకు ప్రజలు ఆసక్తి కనబరిచారు. నిబంధనల మేరకు హాల్‌మార్క్‌తో కూడిన బంగారాన్ని విక్రయించా లంటే పూర్తిస్థాయి నాణ్యత కలిగి ఉండాలి. కానీ చెన్నూరు లో తయారైన బిస్కెట్లలో నాణ్యత లేకపోయినా ముద్ర లు వేయడం కొసమెరుపు. పైగా ప్రభుత్వానికి ఎలాం టి పన్ను చెల్లించకుండా అక్రమంగా అచ్చులు ఉప యోగిస్తూ కోట్లకు పడగలెత్తారు. ఈ అక్రమ దందా పై బంగారం వ్యాపారుల అసోసియేషన్ ధృష్టిసారించి పో లీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు గుట్టు బయ టపడింది.
వెండి ప్యూరిఫై పేరుతో...
మంచిర్యాల జిల్లా కేంద్రంలో వెండి ప్యూరిఫై పేరు తో కొందరు వ్యాపారులు మోసాలకు పాల్పడుతూ అం దినకాడికి దండుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొంతకాలంగా పట్టణంలో వెండి ముద్దలను కరిగించి వాటిపై ఎలాంటి అనుమతులు లేకుండా ప్యూరిటీని తె లిపే స్వస్తిక్ ముద్రలు వేస్తూ దోపిడీకి పాల్పడుతున్న ట్లు తెలుస్తోంది. ప్రభుత్వ అనుమతులతో బంగారం, వెండి నాణ్యతను తెలిపే ముద్రలు వేసే అధికారం కేవ లం ఇప్పటి వరకు హైద్రాబాద్‌లోనే ఉంది. అక్కడ బం గారం, వెండితో తయారైన బిస్కెట్లు, ముద్దలను నిబం ధనల మేరకు పరీక్షించి, అసలైనవిగా నిర్దారణ అయితే ముద్రలు వేయడంతోపాటు ధృవీకరణ పత్రాలు అంద జేస్తారు. జిల్లా కేంద్రంలో ఎలాంటి అనుమతులు లే కుండా అసలు ముద్రలను పోలిన అచ్చులను అక్ర మంగా తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ప ట్టణంలోని గోపాల్‌వాడకు చెందిన సత్యవాన్ సంపత్ పడతరే, అశోక్ రోడ్డుకు చెందిన పడతరే సాగర్‌లు అ క్రమంగా అచ్చులు వేస్తుండగా పోలీసులు దాడులు చే యడంతో అవినీతి దందా వెలుగు చూసింది. పోలీసు లు అచ్చులతోపాటు నిందితులను అదుపులోకి తీసుకో వడంతో జిల్లాలో కలకలం రేపింది.
అక్రమంగా ధృవీకరణ పత్రాలు జారీ...
ఇదిలా ఉండగా జిల్లాలోని కొందరు బంగారు, వెండి వ్యాపారులు మరో కొత్త ఒరవడికి తెరలేపినట్లు ప్రచా రం జరుగుతోంది. ఆభరణాల తయారీకి ఆర్డరు ఇస్తే హాల్‌మార్క్‌తో కూడిన సర్టిఫికెట్లు ఇస్తామంటూ నమ్మ బలుకుతున్నారు. దీంతో నమ్మి వచ్చే వారికి స్థానికం గానే నగలు తయారు చేయిస్తూ, హైద్రాబాద్‌లో చే యించామంటూ మోసగిస్తున్నట్లు సమాచారం. ఇక్కడ తయారైన నగలకే హైద్రాబాద్‌లోని ప్రభుత్వ అనుమతి పొందిన కొన్ని షాపులకు చెందిన హాల్‌మార్క్ సర్టిఫికె ట్లు తెప్పించి ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. హై ద్రాబాద్‌లో నగలు తయారు చేసే వారిని మశ్చిక చేసు కుంటున్న ఇక్కడి వ్యాపారులు వారికి కొంత ముట్టజె ప్పి అక్రమ మార్గంలో హాల్‌మార్క్ సర్టిఫికెట్లు తెప్పిస్తు న్నట్లు సమాచారం. హాల్‌మార్క్ సర్టిఫికెట్లు కలిగిన న గలను దేశంలో ఎక్కడైనా విక్రయించే అవకాశం ఉం టుంది. అయితే అక్రమ మార్గంలో సర్టిఫికెట్లు తెప్పి స్తుండటంతో ఇక్కడ కొనుగోలు చేసిన నగలను ఇతర ప్రాంతాల్లో విక్రయించేందుకు అవకాశం లేక ప్రజలు నిలువునా నష్టపోతున్నారు. ఈ దందాపై పోలీసులు దృష్టిసారించాలని ప్రజలు కోరుతున్నారు.