Share News

హస్తం హవా...!

ABN , Publish Date - Dec 15 , 2025 | 11:57 PM

రెండో వి డుత పంచాయతీ ఎన్నికల్లో హస్తం పార్టీ మద్దతు తె లిపిన అభ్యర్థులు తమ సత్తా చాటారు. ఏకంగా 81 స్థా నాల్లో గెలుపొందడం ద్వారా పల్లెల్లో కాంగ్రెస్‌ జెండా ఎగుర వేశారు.

హస్తం హవా...!

-సత్తా చాటిన కాంగ్రెస్‌ మద్దతు దారులు

-సింహ భాగం సర్పంచ్‌ స్థానాలు కైవసం

-ద్వితీయ స్థానానికే పరిమితమైన బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు

-రెండో విడుతలో కానరాని బీజేపీ ప్రభావం

మంచిర్యాల, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): రెండో వి డుత పంచాయతీ ఎన్నికల్లో హస్తం పార్టీ మద్దతు తె లిపిన అభ్యర్థులు తమ సత్తా చాటారు. ఏకంగా 81 స్థా నాల్లో గెలుపొందడం ద్వారా పల్లెల్లో కాంగ్రెస్‌ జెండా ఎగుర వేశారు. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో భా గంగా బెల్లంపల్లి నియోజక వర్గంలోని బెల్లంపల్లి, తాం డూరు, నెన్నెల, భీమిని, కన్నెపల్లి, వేమనపల్లి, కాసిపేట మండలాల్లో ఈ నెల 14న ఎన్నికలు జరిగాయి. ఏడు మండలాల్లో మొత్తం 114 పంచాయతీల్లో ఎన్నికలు ని ర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. నా మి నేషన్ల ప్రక్రియ ముగిసే సరికి కాసిపేట మండలం ధ ర్మారావుపేట, కన్నెపల్లి మండలం ముత్తాపూర్‌ పంచా యతీలు ఏకగ్రీవం అయ్యాయి. వేమనపల్లి మండలం రాజారం గ్రామంలో రిజర్వేషన్లు అనుకూలించక నామి నేషన్లు దాఖలు కాలేదు. గ్రామాన్ని ఎస్సీ సామాజిక వర్గానికి రిజర్వ్‌ చేయడంతో ఇక్కడ ఆ సామాజిక వర్గం ప్రజలు లేక ఒక్క నామినేషన్‌ కూడా దాఖలు కాలేదు. దీంతో రాజారం పంచాయతీలో సర్పంచ్‌ ఎన్నికలు నిలి చిపోయాయి. ఈ మూడు గ్రామాలను మినహాయించి మిగతా 111 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించారు.

81 స్థానాలు కైవసం....

రెండో విడుత ఎన్నికలు జరిగిన 111 స్థానాల్లో కాం గ్రెస్‌ మద్దతు తెలిపిన అభ్యర్థులు ఏకగ్రీవమైన పంచా యతీలతో కలిపి ఏకంగా 81 స్థానాలను కైవసం చేసు కున్నారు. మిగిలిన పంచాయతీల్లో బీఆర్‌ఎస్‌ మద్దతు దారులు 25 స్థానాల్లో గెలుపొంది ద్వితీయ స్థానంలో నిలవగా, రెండో విడుత ఎన్నికల్లో బీజేపీ ఖాతానే తెర వలేదు. సీపీఐ ఒక స్థానాన్ని తన ఖాతాలో వేసుకోగా ఆరు స్థానాల్లో స్వతంత్రులు విజయబావుటా ఎగుర వే శారు. బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సొం త మండలమైన నెన్నెలలో మాత్రం బీఆర్‌ఎస్‌ మద్దతు దారులు కాంగ్రెస్‌ బలపరిచిన అభ్యర్థులతో నువ్వా... నే నా అన్న చందంగా పోటీ పడ్డారు. ఇరు పార్టీల మద్ద తు దారులు గెలుపు కోసం తీవ్రంగా శ్రమించారు. మం డలంలోని 19 పంచాయతీల్లో కాంగ్రెస్‌ 10 స్థానాలను తన ఖాతాలో వేసుకోగా, తొమ్మిది స్థానాల్లో బీఆర్‌ఎస్‌ మద్దతుదారులు జెండా ఎగుర వేయడం గమనార్హం. ఇ ప్పటి వరకు జరిగిన రెండు విడుతల పంచాయతీ ఎ న్నికల్లో ఎక్కడా లేని విధంగా నెన్నెల మండలంలో బీ ఆర్‌ఎస్‌ మద్దతు దారులు అధికార పార్టీతో సమానం గా పోటీ పడటం కొసమెరుపు. అయితే రెండో విడుత లో ఎన్నికలు జరిగిన మిగతా మండలాల్లో బీఆర్‌ఎస్‌ ప రిస్థితి పూర్తి అధ్వానంగా ఉంది. నెన్నెల మండలంలో తొమ్మిది స్థానాలు పోను మిగతా చోట్ల కేవలం 15 సీట్లు మాత్రమే ఆ పార్టీకి వచ్చాయి. ఇదిలా ఉండగా, పంచా యతీ ఎన్నికల్లో బీజేపీ మద్దతునిచ్చిన అభ్యర్థులు ఒక్క రు కూడా గెలవలేదు. పార్టీ పరంగా పంచాయతీ ఎన్ని కల్లో ముమ్మరంగా ప్రచారం నిర్వహించి నప్పటికీ ఒక్క సీటు కూడా దక్కకపోవడం గమనార్హం.

పార్టీల వారీగా సీట్లు ఇలా....

రెండో విడుత పంచాయతీ ఎన్నికలు జరిగిన బెల్లం పల్లి అసెంబ్లీ నియోజక వర్గం పరిధిలోని ఏడు మండ లాల్లో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లకు దక్కిన సీట్లు ఇలా ఉ న్నాయి. కన్నెపల్లి మండలంలో మొత్తం 15 స్థానాలకు గాను కాంగ్రెస్‌ మద్దతు తెలిపిన అభ్యర్థులు 12 చోట్ల విజయం సాధించగా, బీఆర్‌ఎస్‌ మూడు స్థానాలను కై వసం చేసుకుంది. భీమిని మండలంలో 12 పంచాయ తీల్లో కాంగ్రెస్‌ ఎనిమిది, బీఆర్‌ఎస్‌ నాలుగు సీట్లు, వే మనపల్లి మండలంలో 13 పంచాయతీల్లో కాంగ్రెస్‌ తొ మ్మిది, బీఆర్‌ఎస్‌ నాలుగు, తాండూరు మండలంలో 15 పంచాయతీలకు గాను కాంగ్రెస్‌ ఎనిమిది, బీఆర్‌ఎస్‌ ఒ కటి గెలుచుకోగా, స్వతంత్రులు నాలుగు స్థానాల్లో గెలు పొందారు. నియోజక వర్గ కేంధ్రమైన బెల్లంపల్లిలో 17 మండలాల్లో కాంగ్రెస్‌ 13, బీఆర్‌ఎస్‌ రెండు, సీపీఐ ఒక టి, స్వతంత్రులు ఒక స్థానం కైవసం చేసుకున్నారు. కాసిపేట మండలంలో 22 పంచాయతీలకుగాను కాం గ్రెస్‌ మద్దతుదారులు 19, బీఆర్‌ఎస్‌ బలపరిచిన వారిలో రెండు, స్వతంత్రులు ఒక స్థానంలో గెలుపొందారు.

Updated Date - Dec 15 , 2025 | 11:57 PM