kumaram bheem asifabad- కాగజ్‌నగర్‌లో మరిన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హాల్టింగ్
ABN , Publish Date - Sep 16 , 2025 | 11:17 PM
కాగజ్‌నగర్‌లో మరిన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హాల్టింగ్ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్‌బాబు అన్నారు. పాటలీ పుత్ర సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌కు కాగజ్‌నగర్‌లో మంగళవారం రైల్వే అధికారులు హాల్టింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాటలీపుత్ర ఎక్స్‌ప్రెస్ రైలుకు జెండా ఊపి ప్రారంభించారు.
కాగజ్‌నగర్, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): కాగజ్‌నగర్‌లో మరిన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హాల్టింగ్ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్‌బాబు అన్నారు. పాటలీ పుత్ర సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌కు కాగజ్‌నగర్‌లో మంగళవారం రైల్వే అధికారులు హాల్టింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాటలీపుత్ర ఎక్స్‌ప్రెస్ రైలుకు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాగజ్‌నగర్ రైల్వేస్టేషన్‌లో మరిన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లు హాల్టింగ్ ఇచ్చారని తెలిపారు. కార్యక్రమంలో రైల్ సేవా సమితి అధ్యక్షులు ప్రయాగ్ తివారి, పవన్ బల్దువా, అసెంబ్లీ కన్వీనర్ వీరభధ్రచారి, మాజీ జడ్పీటీసీ నీరటి సత్యనారాయణ, మహిళ మోర్చా జిల్లా అధ్యక్షురాలు వలుపదాసు, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
ప్రాణహితను పూర్తి చేసే బాధ్యత కాంగ్రెస్‌దే
కౌటాల, (ఆంధ్రజ్యోతి): ప్రాణహితను పూర్తి చేసే బాధ్యత కాంగ్రెస్‌దే అని ఎమ్మెల్యే హరీష్‌బాబు అన్నారు. మంగళవారం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రాణహిత ప్రాజెక్టు ప్రారంభించక పోతే వచ్చే శాసన సభ ఎన్నికల్లో పోటీ చేయనని ఎమ్మెల్సీ దండే విఠల్ ఇటీవల ప్రకటించటంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై అపనమ్మకం వస్తోందని అన్నారు. 2008లోనే అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రారంభించినట్టు కొత్తగా ఇప్పుడు ప్రారంభించేది ఏమీ లేదన్నారు. ప్రాజెక్టును పూర్తి చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందన్నారు. సమావేశంలో జిల్లా అధ్యక్షులు దోని శ్రీశైలం, జిల్లా ఉపాధ్యక్షులు బండి రాజేందర్ గౌడ్, మండల అధ్యక్షులు విజయ్, మాజీ జడ్పీటీసీ సభ్యుడు ఎల్ములే మల్లయ్య, నీరటి సత్యనారాయణ, మాజీ ఎంపీటీసీ దుర్గం మోతీరాం తదితరులు పాల్గొన్నారు.
రక్తదాన శిబిరాన్నిప్రారంభించిన ఎమ్మెల్యే
కౌటాల, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో మంగళవారం ప్రధాని నరేంద్రమోదీ జన్మదినం సందర్భంగా విమల లైఫ్ కేర్ ఆసుపత్రిలో రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే హరీష్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ సేవా పక్వాడా కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు. అనంతరం మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల్ల మంజూరు పత్రాలను ఎమ్మెల్యే లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటి చైర్మన్ దేవయ్య, తహసిల్దార్ ప్రమోద్, ఎంపీఓ మహేందర్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు దోని శ్రీశైలం, ఉపాధ్యక్షులు రాజేందర్ పాల్గొన్నారు.