గుండా మల్లేష్ సేవలు చిరస్మరణీయం
ABN , Publish Date - Oct 13 , 2025 | 10:59 PM
సీపీఐ నేత మాజీ ఎమ్మెల్యే దివంగత గుండా మ ల్లేష్ సేవలు చిరస్మరణీయమని సీపీఐ పట్టణ కార్యదర్శి ఆడెపు రాజమౌళి, నాయకులు అ న్నారు. సోమవారం దివంగత గుండా మల్లేశ్ 5వ వర్థంతి సందర్భంగా సీపీఐ నాయకులు చిత్రపటానికి, విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు ఆర్పించి మాట్లాడారు.
బెల్లంపల్లి, అక్టోబరు13 (ఆంధ్రజ్యోతి): సీపీఐ నేత మాజీ ఎమ్మెల్యే దివంగత గుండా మ ల్లేష్ సేవలు చిరస్మరణీయమని సీపీఐ పట్టణ కార్యదర్శి ఆడెపు రాజమౌళి, నాయకులు అ న్నారు. సోమవారం దివంగత గుండా మల్లేశ్ 5వ వర్థంతి సందర్భంగా సీపీఐ నాయకులు చిత్రపటానికి, విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు ఆర్పించి మాట్లాడారు. బెల్లంపల్లి ఎ మ్మెల్యేగా మూడు సార్లు గెలిచి ప్రజల సంక్షేమానికి కృషి చేశారన్నారు. సామాన్య రైతు కు టుంబంలో జన్మించి భారత కమ్యూనిస్టు పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి ప్రజా సేవకే జీవి తాన్ని అంకితం చేశారన్నారు. బడుగు, బలహీన పేద వర్గాల ప్రజల కోసం అలుపెరుగని పోరాటం చేసిన మహానీయుడని పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా గుండా మల్లేశ్ పదవి కాలంలో ఎంతో మంది నిరుపేదలకు భూమి, ఇల్లు, పంపిణీ చేశారని పేర్కొన్నారు. ప్రజా శ్రేయస్సు కోసం ఎళ్లవేలలా ముందున్న మహానీయుడని ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్య క్రమంలో నాయకులు కామెర మల్లయ్య, బొంతల లక్ష్మీనారాయణ, సరోజ, రాజేశ్, అంబే ద్కర్, చంద్రమాణిక్యం, రత్నం రాజం, ప్రశాంత్, సమ్మయ్యలు పాల్గొన్నారు.
కార్మిక ఉద్యమాల్లో గుండా మల్లేష్‌ది పెద్దన్న పాత్ర
మంచిర్యాల కలెక్టరేట్ : కార్మిక ఉద్యమాల్లో గుండా మల్లేష్‌ది పెద్దన్న పాత్ర అని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మేకల దాసు, పట్టణ కార్యదర్శి కలిందర్‌ఆలీఖాన్‌లు పేర్కొన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సీపీఐ పార్టీ కార్యాలయంలో గుండా మల్లేష్ వర్ధంతిని ఘ నంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళలుర్పించారు. బెల్లం పల్లి ఎమ్మెల్యేగా నియోజకవర్గంలోని ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు లింగం రవి, పౌలు, కిషన్‌రావు, స త్యనారాయణ, పోచన్న, శంకరయ్య, మొగిలి, లక్ష్మణ్, సాంబయ్య, మొండయ్య, రాయమల్లు, శంకర్ పాల్గొన్నారు.
కాసిపేట : దివంగత నేత, మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్ వర్ధంతిని సీపీఐ నాయకులు సోమవారం సోమగూడెంలో ఘనంగా నిర్వహించారు. గుండా మల్లేష్ చిత్రపటానికి సీపీఐ మండల కార్యదర్శి దాగం మల్లేష్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమం లో నాయకులు జాడి పోచం, కుర్సెంగ హన్మంతు, గట్టయ్య, గట్టు సర్వేశం, దాగం రాజలిం గు, బండారి సత్తయ్య, పులి శంకర్, దుర్గం పోశం పాల్గొన్నారు.