Suspected Terrorists House: ఉగ్రవాది ఇంట్లో 3 గంటలు సోదాలు
ABN , Publish Date - Nov 13 , 2025 | 05:17 AM
గ్రవాద ఆరోపణలతో అరెస్టయిన డాక్టర్ సయ్యద్ అహ్మద్ మొహియుద్దిన్ నివాసంలో గుజరాత్ యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్...
మొహియుద్దిన్ ఇంటిని జల్లెడ పట్టిన గుజరాత్ ఏటీఎస్
కంప్యూటర్ హార్డ్ డిస్క్, పత్రాలు, రసాయనాలు స్వాధీనం
హైదరాబాద్‌లో విస్తృత తనిఖీలు
హైదరాబాద్ సిటీ, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): ఉగ్రవాద ఆరోపణలతో అరెస్టయిన డాక్టర్ సయ్యద్ అహ్మద్ మొహియుద్దిన్ నివాసంలో గుజరాత్ యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ (ఏటీ ఎస్)పోలీసులు బుధవారం సోదాలు నిర్వహించారు. రాజేంద్రనగర్‌లోని అతడి నివాసంలో 3 గంటలపాటు సోదాలు నిర్వహించి పలు పత్రాలు, రసాయనాలు, కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీలో జరిగిన కారు బాంబు పేలుడుకు రెండు రోజుల ముందు ఏటీఎస్ పోలీసులు ముగ్గురు ఉగ్రవాదులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వీరిలో మొహియుద్దీన్ కూడా ఉన్నాడు. మంగళవారం అర్ధరాత్రి హైదరాబాద్‌కు చేరుకున్న ఏటీఎస్ బృందం.. మొహియుద్దీన్ ఇంటికి రాత్రి 2 గంటలకు చేరుకుంది. ఇంట్లో 3 గంటలపాటు సోదాలు నిర్వహించింది.
నగరంలో కొనసాగుతున్న హై అలర్ట్
ఢిల్లీ కారు బాంబు పేలుడు నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో హై అలర్ట్ కొనసాగుతోంది. గత మూడు రోజులుగా నగరంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రముఖ దేవాలయాలు, ఎంజీబీఎస్, జేబీఎస్ ఇతర బస్ట్టాండ్లు, సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఆర్పీఎఫ్ పోలీసులు డాగ్‌స్క్వాడ్, బాంబు స్క్వాడ్‌లతో వాహనాలను ముమ్మరంగా తనిఖీ చేశారు. ఇతర రాష్ట్రాలు, దేశాలకు చెందిన వారిని గుర్తించి అన్ని రకాల ధ్రువపత్రాలు పరిశీలిస్తున్నారు.