Share News

Agriculture Minister Tummala Nageswara Rao: ఆదాయం వచ్చే పంటలు సాగు చేయాలి

ABN , Publish Date - Oct 15 , 2025 | 04:25 AM

రైతులు మూస పద్ధతిలో వ్యవసాయం చేయకుండా అధిక ఆదాయం ఇచ్చే నూనెగింజలు, ఆయిల్‌ పామ్‌, ఇతర ఉద్యాన పంటలు సాగుచేయాలని..

Agriculture Minister Tummala Nageswara Rao: ఆదాయం వచ్చే పంటలు సాగు చేయాలి

హైదరాబాద్‌, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): రైతులు మూస పద్ధతిలో వ్యవసాయం చేయకుండా అధిక ఆదాయం ఇచ్చే నూనెగింజలు, ఆయిల్‌పామ్‌, ఇతర ఉద్యాన పంటలు సాగుచేయాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. వేరుశనగ విత్తనాల్లోనూ కొత్త వంగడాలు అందుబాటులోకి వచ్చాయని, అధిక దిగుబడితోపాటు ఆదా యం కూడా వస్తుందని తెలిపారు. జాతీయ నూనెగింజల మిషన్‌ పథకంలో భాగంగా రైతులకు ఉచితంగా వేరుశనగ విత్తనాలు పంపిణీచేసే కార్యక్రమాన్ని మంత్రి తుమ్మల మంగళవారం సచి వాలయం నుంచి ప్రారంభించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన రైతులకు వేరుశనగ విత్తనాలు పంపిణీ చేశారు. ‘రైతునేస్తం’ కార్యక్రమంలో రైతులతో వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది రూ.66.67 కోట్లతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నూనెగింజల మిషన్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహబూబ్‌నగర్‌, వనపర్తి, జోగులాంబగద్వాల, నారాయణపేట, నాగర్‌కర్నూల్‌, రంగారెడ్డి, నల్లగొండ, వికారాబాద్‌ జిల్లాల రైతులకు 45,350 ఎకరాల్లో సాగు చేయటానికి 38,434 క్వింటాళ్ల విత్తనాలు వంద శాతం సబ్సిడీతో పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

Updated Date - Oct 15 , 2025 | 04:25 AM