MLC Kavitha: గ్రూప్ 1 నియామకాలు రద్దు చేయాలి
ABN , Publish Date - Oct 10 , 2025 | 04:20 AM
టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 విషయంలో నోటిఫికేషన్ నాటి నుంచి ఫలితాల వరకు అడుగడుగునా తప్పులు జరిగాయని ఎమ్మెల్సీ...
నేడు అశోక్ నగర్ చౌరస్తాలో వంటా వార్పు: ఎమ్మెల్సీ కవిత
పంజాగుట్ట, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 విషయంలో నోటిఫికేషన్ నాటి నుంచి ఫలితాల వరకు అడుగడుగునా తప్పులు జరిగాయని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. గ్రూప్-1 పోస్టుల నియామకాలను రద్దు చేసి తిరిగి మళ్లీ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. గ్రూప్- 1 నిరుద్యోగ అభ్యర్థులకు మద్దతుగా అశోక్‌నగర్ చౌరస్తాలో శుక్రవారం వంటా వార్పు కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ప్రకటించారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. కోచింగ్ సెంటర్ నిర్వాహకులు అశోక్, ప్రభాకర్, నిరుద్యోగులు, జాగృతి నాయకులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. గతంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అశోక్‌నగర్‌కు వచ్చి నిరుద్యోగ అభ్యర్థులకు మాయమాటలు చెప్పి దొంగ ప్రమాణాలు చేశారని, రెండేళ్లుగా ఆయన హైదరాబాద్‌కు రాకుండా పారిపోయారని విమర్శించారు. నిరుద్యోగులతరఫున తాము కొట్లాడుతామని, అందరూ పరీక్షలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.