Share News

kumaram bheem asifabad- హిందూ కమ్యూనిటీ షెడ్‌కు భూమి పూజ

ABN , Publish Date - Dec 24 , 2025 | 09:51 PM

మండల కేంద్రంలో బుధవారం జైనూర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కుడిమెత విశ్వనాథ్‌రావ్‌, జైనూర్‌ మేజర్‌ గ్రామ పంచాయతీ సర్పంచ్‌ కొడప ప్రకాష్‌, హిందూ ఉత్సవ కమిటీ అధ్యక్షుడుు త్ర ం భీంరావ్‌ తదితరులు హిందూ కమ్యూనిటీషెడ్డు పనులకు భూమి పూజ నిర్వహించారు.

kumaram bheem asifabad- హిందూ కమ్యూనిటీ షెడ్‌కు భూమి పూజ
:హిందూ కమ్యూనిటీషెడ్డు పనులకు భూమి పూజ చేస్తున్న నాయకులు

జైనూర్‌, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో బుధవారం జైనూర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కుడిమెత విశ్వనాథ్‌రావ్‌, జైనూర్‌ మేజర్‌ గ్రామ పంచాయతీ సర్పంచ్‌ కొడప ప్రకాష్‌, హిందూ ఉత్సవ కమిటీ అధ్యక్షుడుు త్ర ం భీంరావ్‌ తదితరులు హిందూ కమ్యూనిటీషెడ్డు పనులకు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కుడిమెత విశ్వనాథ్‌రావ్‌ మాట్లాడుతూ హిందూ కమిటీ షెడ్‌ నిర్మాణం కోసం త్వరలో నిధులు మంజురు అయ్యేలా ఖనాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ భొజ్జు, జిల్లా ఉన్నతాధికారులకు వివరిస్తామన్నారు. అతి త్వరలో నిధులు మంజురు చేసి షెడ్‌ పనులు పూర్తి చేస్తామని చెప్పారు. నూతన సర్పంచ్‌ కొడప ప్రకాష్‌ మాట్లాడు తూ జైనూర్‌ మేజర్‌ గ్రామ పంచాయతీ అభివృద్ధికి అహర్నిషలు కృషి చేస్తామని అన్నారు. అదేవిధంగా పంచాయతీ వాసుల పరస్పర సహకారంతో అభివృద్ధికి ఎక్కువ నిధులు వచ్చేలా చూస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఆ కమిటీ సభ్యులు పవన్‌కుమార్‌, పెందుర్‌ ప్రకాష్‌, ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 24 , 2025 | 09:51 PM