Share News

Greenfield Highway: గ్రీన్‌ఫీల్డ్‌ హైవే వెళ్లేదిలా..!

ABN , Publish Date - Oct 04 , 2025 | 04:05 AM

ఫ్యూచర్‌ సిటీ నుంచి బందరు పోర్టు వరకూ ప్రతిపాదిస్తున్న 12 వరుసల గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే అలైన్‌మెంట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా రూపొందించింది. ఆ వివరాలను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది.....

Greenfield Highway: గ్రీన్‌ఫీల్డ్‌ హైవే వెళ్లేదిలా..!

  • తెలంగాణలోని 2 జిల్లాలు, 40 గ్రామాలు.. ఏపీ పరిధిలోని 3 జిల్లాలు, 60 గ్రామాలు

  • ప్రాథమికంగా అలైన్‌మెంట్‌ రూపకల్పన.. డీపీఆర్‌ కన్సల్టెంట్స్‌ నియామకానికి కసరత్తు

  • డిసెంబరుకు పూర్తి అలైన్‌మెంట్‌ వచ్చే చాన్స్‌.. ‘ఆంధ్రజ్యోతి’కి లభించిన 12 వరుసల హైవే వివరాలు

హైదరాబాద్‌, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): ఫ్యూచర్‌ సిటీ నుంచి బందరు పోర్టు వరకూ ప్రతిపాదిస్తున్న 12 వరుసల గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే అలైన్‌మెంట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా రూపొందించింది. ఆ వివరాలను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. దాని ప్రకారం రోడ్డును మంజూరు చేసి, నిర్మించాలని కోరుతోంది. ప్రాథమిక అలైన్‌మెంట్‌, రూట్‌ మ్యాప్‌ వివరాలు ‘ఆంధ్రజ్యోతి’కి లభించాయి. దాని ప్రకారం.. ప్రతిపాదిత మార్గం 2 రాష్ట్రాలు.. 5 జిల్లాలు, 100 గ్రామాల మీదుగా వెళ్లనుంది. వీటిలో తెలంగాణ పరిధిలో 2 జిల్లాల్లోని 40 గ్రామాలు ఉండగా.. ఏపీ పరిధిలో 3 జిల్లాల్లోని 60 గ్రామాల పక్కనుంచి హైవే వెళ్లనుంది. ఈ మేరకు ఆయా జిల్లాలు, గ్రామాల వారీగా ప్రాథమికంగా అలైన్‌మెంట్‌ రూపుదిద్దుకుంది. కేంద్రం ఆమోదిస్తే దీని ప్రకారమే హైవే ఉండనుంది. ఇక, అలైన్‌మెంట్‌కు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్‌) రూపకల్పన బాధ్యతను ఓ కన్సల్టెన్సీకి అప్పగించాలని ఎన్‌హెచ్‌ఏఐ భావిస్తోంది. అక్టోబరు మూడో వారానికి కన్సల్టెన్సీ ఎంపికైతే డిసెంబరునాటికి పూర్తిస్థాయి అలైన్‌మెంట్‌ పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారవర్గాల సమాచారం. ఫ్యూచర్‌ సిటీ నుంచి అమరావతి మీదుగా మచిలీపట్నం దగ్గరున్న బందరు పోర్టుకు వెళ్లే గ్రీన్‌ ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ వే ప్రాథమిక అలైన్‌మెంట్‌ ప్రకారం తెలంగాణలోని ఉమ్మడి రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల పరిధిలోని దాదాపు 40 గ్రామాల పక్క నుంచి వెళ్లనుంది. ఇక, తెలంగాణ సరిహద్దు ముగిసి.. ఏపీ భూభాగంలోకి ప్రవేశించిన తర్వాత కృష్ణా, గుంటూరు (అమరావతి క్యాపిటల్‌ సిటీ), పల్నాడు జిల్లాల మీదుగా బందరు పోర్టు వరకు 60 గ్రామాల పక్క నుంచి రహదారి ఉండనుంది. దీని మొత్తం పొడవు 297 కిలో మీటర్లుగా అలైన్‌మెంట్‌లో పేర్కొన్నారు. పూర్తిస్థాయి అలైన్‌మెంట్‌ ఖరారులో వీటిలో కొన్ని మార్పులు ఉండొచ్చని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కాగా అడవి దేవులపల్లి, గొట్టెముక్కల దగ్గర్లో తెలంగాణ సరిహద్దు ఉండనుంది. మార్గమధ్యలో వ్యవసాయ, వ్యవసాయేతర, అటవీ భూములు, చెరువులు, కుంటలు ఎన్ని ఉన్నాయనే వివరాలను కూడా ప్రాథమికంగా తేల్చారు. కానీ, పూర్తిస్థాయి అలైన్‌మెంట్‌ ఖరారైన తర్వాతే వీటి వివరాలు కూడా తేలనున్నాయి. ప్రాథమికంగా రూపొందించిన అలైన్‌మెంట్‌ ప్రకారం.. ఔటర్‌ రింగు రోడ్డు (ఓఆర్‌ఆర్‌) - రీజనల్‌ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) మధ్యలో ప్రభుత్వం ప్రతిపాదించిన భారత్‌ ఫ్యూచర్‌ సిటీకి (ముచ్చర్ల ) దగ్గర్లో ఉన్న తిప్పారెడ్డిపల్లికి కొంత దూరంలో కుడివైపు నుంచి ఈ రహదారి ప్రారంభమై అమరావతి క్యాపిటల్‌ సిటీకి పక్క నుంచి లంకెలపల్లి మీదుగా బందరు పోర్టుకు అనుసంధానం కానుంది.


haiway-2.jpg

తెలంగాణ పరిధిలోని గ్రామాలివే..

ప్రాథమికంగా రూపొందించిన అలైన్‌మెంట్‌ ప్రకారం.. 40 గ్రామాల పక్క నుంచి ఈ రోడ్డు ఉండనుంది. అవి..ఉమ్మడి రంగారెడ్డి జిల్లా: మీర్‌ఖాన్‌పేట, తాడిపర్తి, సింగారం, నందివనపర్తి, నక్కెర్త, మేడిపల్లి, యాచారం, మల్కీజ్‌గూడ, మంది గౌరెల్లి, తక్కెళ్లపల్లి, చింతపట్ల, తమ్మలోనిగూడ, నల్లవెల్లి, మాల్‌, మంతన్‌ గౌరెల్లి, ఉమ్మడి నల్లగొండ జిల్లా: తమ్మాడపల్లి, అజిలాపూర్‌, ఏరుగండ్లపల్లి, కొండూరు, మర్రిగూడ, రామ్‌రెడ్డిపల్లి, వట్టిపల్లి, లింగోటం, భీమనపల్లి, దామెర, చిట్టెంపహాడ్‌, నాంపల్లి, మొహమ్మదా పురం, ఊట్లపల్లి, తేనెపల్లె, గుర్రంపోడ్‌, చేపూర్‌, మోసంగి, తెప్పలమడుగు, హాలియా, మాచర్ల, కొంపల్లి, బోయగూడెం, రాజవరం, అడవి దేవులపల్లి.


ఏపీ పరిధిలోని 60 గ్రామాలు ఇవే..

ఏపీ పరిధిలో 60 గ్రామాల మీదుగా హైవే వెళ్లనుంది. అవి.. కళ్లేపల్లి, దైద, వజీరాబాద్‌, పులిపాడు, దాచేపల్లి, ముత్యాలంపాడు, పిన్నెల్లి, వేమవరం, మాచవరం, తురక పాలెం, మోర్జంపాడు, పిల్లుట్ల, శ్రీరుక్మిణీపురం, పాపాయ పాలెం, చంద్రాజుపాలెం, కందిపాడు, అమరావతి, పెరికపాడు, దొడ్లేరు, హస్సన్‌బండ, అనంతారం, గుడిపాడు, తళ్లూరు, పెసపాడు, రెంటపల్లి, పండితాపురం, అమరావతి, పాటిబండ్ల, వేమారం, సిరిపురం, మందెపూడి, పాములపాడు, పొన్నెకల్లు, నిడుముక్కల, తాడికొండ, లామ్‌, గోరంట్ల, గుంటూరు, కంతేరు, కాజ, నంబూరు, చిలువూరు, పెర్కలపుడి, దుగ్గిరాల, వల్లభాపురం, మున్నంగి, వల్లూరు, భద్రిరాజుపాలెం, కుమ్మమూరు, కపిలేశ్వరపురం, లంకపల్లి, చల్లపల్లి, నిమ్మకూరు, నిడుమూరు, గూడూరు, పెడన, మచిలీపట్నం. ప్రస్తుతానికి ఏపీ పరిధిలో ఈ గ్రామాల పక్కగా అలైన్‌మెంట్‌ ఉన్నప్పటికీ దీనిపై ఇంకా ఏపీ ప్రభుత్వం ఎలాంటి అభిప్రాయాలు తెలపలేదు. డీపీఆర్‌ కన్సల్టెన్సీ ఎంపికైన తర్వాత పూర్తిస్థాయి అలైన్‌మెంట్‌ ఖరారు సమయానికి వీటిలో కొంతమేర మార్పులు ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - Oct 04 , 2025 | 06:17 AM