NTPC Project: తెలంగాణ ఎన్టీపీసీ ప్రాజెక్టుకు గ్రీన్‌సిగ్నల్
ABN , Publish Date - Sep 13 , 2025 | 05:29 AM
పెద్దపల్లి జిల్లాలో ఎన్టీపీసీ నిర్మించ తలపెట్టిన తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు టీఎ్‌సటీపీపీకు కేంద్రం నుంచి గ్రీన్‌సిగ్నల్ లభించింది..
జ్యోతినగర్, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): పెద్దపల్లి జిల్లాలో ఎన్టీపీసీ నిర్మించ తలపెట్టిన తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు (టీఎ్‌సటీపీపీ)కు కేంద్రం నుంచి గ్రీన్‌సిగ్నల్ లభించింది. 2,400 మెగావాట్ల సామర్థ్యం గల టీఎ్‌సటీపీపీ రెండో దశ ప్రాజెక్టుకు కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ పర్యావరణ అనుమతులు (ఈసీ) ఇస్తూ గురువారం రాత్రి సర్క్యూలర్ జారీ చేసింది. ఎనిమిది నెలల తరువాత కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ ప్రస్తుతం ఎన్విరాన్‌మెంట్ క్లియరెన్సును ఇచ్చింది.