సాదాబైనామాలకు గ్రీన్ సిగ్నల్...
ABN , Publish Date - Sep 02 , 2025 | 11:39 PM
సాదాబై నామాలతో భూముల క్రమబద్ధీకరణకు ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. హై కోర్టు ఉత్తర్వులతో ఈ అంశం పై మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. కాంగ్రెస్ సర్కారు సాదాబైనామాలతో భూముల క్రమబద్దీకరణకు పూను కోగా, హై కోర్టు ఇచ్చిన స్టే కారణంగా ఆ ప్రక్రియకు బ్రేక్ పడింది.
-హై కోర్టు ఉత్తర్వులతో చిగురిస్తున్న ఆశలు
-2016 నుంచి క్రమబద్ధీకరణకు నోచుకోని వైనం
-అసైన్డ్ భూముల పరిష్కారం లబ్ధిదారుల ఎదురు చూపు
-రెవెన్యూ సదస్సులో 30వేల పైచిలుకు దరఖాస్తులు
-ధరణిలో పరిష్కారంకాని భూ సమస్యలు
మంచిర్యాల, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): సాదాబై నామాలతో భూముల క్రమబద్ధీకరణకు ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. హై కోర్టు ఉత్తర్వులతో ఈ అంశం పై మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. కాంగ్రెస్ సర్కారు సాదాబైనామాలతో భూముల క్రమబద్దీకరణకు పూను కోగా, హై కోర్టు ఇచ్చిన స్టే కారణంగా ఆ ప్రక్రియకు బ్రేక్ పడింది. అయితే గతంలో ఇచ్చిన స్టే ను సవరి స్తూ ఇటీవల హై కోర్టు ప్రభుత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వ డంతో మళ్లీ ఆ ప్రక్రియ కొనసాగనుంది. బీఆర్‌ఎస్ ప్ర భుత్వం అట్టహాసంగా ప్రారంభించిన ’ధరణి’ భూ స మస్యలకు పరిష్కారం చూపకపోగా అనేక చిక్కుము డులను తెచ్చిపెట్టింది. ఆర్జీల పరిష్కారం కోసం రైతు లు కాళ్లరిగేలా తిరిగిన స్పందనలేకుండా పోయింది. ఈ క్రమంలో కాంగ్రెస్ హయాంలో ’ధరణి’ స్థానంలో ప్ర వేశపెట్టిన ’భూ భారతి’ ద్వారా సాదాబైనామాల సమ స్యలను పరిష్కరించనున్నట్లు ప్రకటించడంతో రైతుల్లో ఆశలు చిగురించాయి. భూ భారతి పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులను సైతం ఆహ్వానించింది. గత ఏడాది నిర్వహించిన రెవెన్యూ సదస్సులలో పెద్ద మొ త్తంలో దరఖాస్తులు వచ్చాయి. అధికారులు స్వీకరించిన దరఖాస్తుల్లో అధిక భాగం సాదాబైనామా, అసైన్డ్ భూ ములకు సంబంధించిన వికావడం గమనర్హం. జిల్లా వ్యాప్తంగా సాదాబైనామా పరిష్కారం కోసం 30,405 దరఖాస్తులు వచ్చాయి. బీఆర్‌ఎస్ హయాంలో సాదాబైనామాలతో భూముల క్రమబద్ధీకరణకు 2020 అక్టోబర్‌లో దరఖాస్తులు స్వీకరించినప్పటికీ పరిష్కా రానికి నోచుకోలేదు. ప్రస్తుతం హై కోర్టు ప్రభుత్వానికి మద్దతుగా తీర్పును ఇవ్వడంతో ఆ ప్రక్రియ ప్రారంభమైంది.
సమస్యల పరిష్కారం దిశగా....
ప్రభుత్వం ఆర్వోఆర్-2020-25 భూ భారతి చట్టాన్ని తీసుకవచ్చింది. ఇందులో భాగంగా రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయగా బాధితులు దరఖాస్తులు చేసుకున్నా రు. గత ప్రభుత్వం అంతకు ముందున్న రైతులకు భూ హక్కులు కల్పించే పట్టదారు పాసు పుస్తకాల చట్టం - 1971ని రద్దు చేసి కొత్తగా పాసు పుస్తకాల చట్టం -2020 పేరిట ధరణిని తీసుకొచ్చింది. అయితే ఈ వి ధానం ఆశించిన ఫలితాలను ఇవ్వకపోగా, కొత్త సమస్య లను తీసుకొచ్చింది. ఈ క్రమంలో కాంగ్రెస్ సర్కార్ గత ఏప్రిల్ 14న ధరణి స్థానంలో కొత్తగా భూ భారతి పోర్టల్‌ను తీసుకొచ్చింది. ఇందులో బాగంగా జూన్ 3వ తేదీ నుంచి అన్ని మండలాల్లో ప్రభుత్వం రెవెన్యూ స దస్సులు నిర్వహించి 20వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించింది. రాష్ట్ర వ్యాప్తంగా భూ సమస్యలను పరి ష్కరించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఉండటంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
ఎట్టకేలకు మొదలైన కార్యాచరణ...
రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో సాదాబై నామా కూడ ఒకటి. గతంలో గ్రామాల్లో చాలా మంది రైతులు రెవెన్యూ స్టాంప్ పేపర్లు, తెల్లకాగితాలపై భూ ముల క్రయవిక్రయాలు జరిపేవారు. ఈ విధానంలో భూములపై హక్కు సంపూర్ణంగా లభించేది కాదు. ఈ విషయమై దృష్టిసారించిన గత ప్రభుత్వం సాదాబైనా మాల సమస్యను పరిష్కరించేందుకు 2016లో జీవో నెంబర్ 153ను తీసుకొచ్చింది. 2014 జూన్ 2వ తేదీకి ముందుగా సాదాబైనామాలతో భూములు కొనుగోలు చేసిన రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించి చట్టబ ద్దత కల్పించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో బీఆర్ ఎస్ ప్రభుత్వం 2020 అక్టోబర్ 12న కూడ జీవో నెంబర్ 112ను జారీ చేసింది. సాదాబైనామాల సమస్యల పరి ష్కారం కోసం మంత్రివర్గ ఉప సంఘాన్ని కూడా వేసింది. అయినా సమస్యలకు పరిష్కారం లభించ లేదు. ఆ సమస్య పరిష్కారం కాకుండానే 29అక్టోబర్ 2020లో కొత్త పట్టాదారు పాసుపుస్తకాల చట్టాన్ని తె చ్చింది. ఎన్నిసార్లు జీవోలు తెచ్చినా...పరిష్కారం చూప కపోవడంతో విమర్శలు మూటగట్టుకుంది. గత ప్రభు త్వం కేవలం జీవోల జారీతోనే సరిపెట్టిందని, సాదా బైనామాలపై తహసీల్దార్‌లకు అధికారాలు ఇచ్చినప్ప టికీ, వాటిని పరిష్కరించేందుకు సరైన మార్గదర్శకాల ను విడుదల చేయలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నా యి. ఈ క్రమంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్ర భుత్వం భూభారతి చట్టం ద్వారా రైతు సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన కార్యాచరణ ప్రారం భించింది.సాదాబైనామాలతోపాటు అసైన్డ్ భూముల సమస్యల పరిష్కారానికి కూడా దరఖాస్తులు వచ్చాయి. ముందుకు సాగు సమయంలో సాదాబైనామాల అంశం హైకోర్టుకు వెళ్లడం, ఈ అంశంపై స్టే విధించింది. ప్ర భుత్వం కూడా ఎటూ తేల్చుకోలేని సంకట స్థితిలోకి వెళ్లింది. వాస్తవానికి ప్రభుత్వం భూ భారతి చట్టంలో సాదాబైనామాల సమస్యను చేర్చినందున హైకోర్టు తీ ర్పు కూడా అనుకూలంగా వస్తుందనే అభిప్రాయా ల ను దరఖాస్తుదారులు అప్పట్లోనే వ్యక్తపరిచారు. ప్ర స్తుతం ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వెలువడినం దున ప్రభుత్వం విధి విధానాలు రూపొందించి సమ స్యలకు పరిష్కారం చూపేందుకు సన్నద్దం అవుతోంది. ఇందులో భాగంగా 2020 వరకు ఉన్న సాదాబైనా మాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని నిర్ణయిం చారు. రెవెన్యూ సదస్సుల్లో స్వీకరించిన 30,405 దరఖా స్తుల్లో నిబందనలకు విరుద్దంగా ఉన్న 24,800 అప్లికేష న్లను తిరస్కరించగా, మిగిలిన 5572 మందికి నోటీసు లు జారీ చేశారు. ఇప్పటి వరకు 3143 విచారణ జరు పగా, మరో 2532 దరఖాస్తుల విచారణ జరగాల్సి ఉంది.