కోర్ట్ కాంప్లెక్స్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్...
ABN , Publish Date - Jun 07 , 2025 | 11:26 PM
జిల్లా కేంద్రం లో కోర్టుల భవన సముదాయ నిర్మాణానికి ఎట్టకేలకు మోక్షం లభించింది. ’న్యాయ నిర్మాణ ప్లాన్’ కింద రాష్ట్ర వ్యాప్తంగా 12 జిల్లాలకు కోర్టు కాంప్లెక్స్‌లకు గ్రీన్ సిగ్న ల్ లభించగా, అందులో మంచిర్యాల జిల్లా సైతం ఉం ది.
-రూ. 81 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం
-కలెక్టరేట్ సమీపంలో ఐదెకరాల స్థలం కేటాయింపు
-ఒకే సముదాయంలో అన్ని కోర్టుల ఏర్పాటు
-ముగిసిన టెండర్ల ప్రక్రియ
మంచిర్యాల, జూన్ 7 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రం లో కోర్టుల భవన సముదాయ నిర్మాణానికి ఎట్టకేలకు మోక్షం లభించింది. ’న్యాయ నిర్మాణ ప్లాన్’ కింద రాష్ట్ర వ్యాప్తంగా 12 జిల్లాలకు కోర్టు కాంప్లెక్స్‌లకు గ్రీన్ సిగ్న ల్ లభించగా, అందులో మంచిర్యాల జిల్లా సైతం ఉం ది. ఈ మేరకు ఒక్కో జిల్లాకు 10+2 ప్రాతిపదికన రూ. 81 కోట్లను ప్రభుత్వం మంజూరు చేస్తూ జీవో ఆ ర్టీ నంబర్ 597 ద్వారా పరిపాలన అనుమతులు జారీ చేసింది. కోర్టు కాంప్లెక్స్ నిర్మించడానికి టెండర్లను సై తం ఆహ్వానించగా, ఆ ప్రక్రియ పూర్తికాగానే పనులు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. మంచిర్యాలలో వివిధ కోర్టులు ఏర్పడి సుమారు 17 ఏళ్లు గడుస్తున్నా శాశ్వత భవనాలు లేక ఇంతకాలం ఇబ్బందులు తప్ప లేదు. ఉట్నూరులో ఉన్న మొబైల్ కోర్టును 2005 ఏప్రి ల్ 7న జూనియర్ సివిల్ జడ్జి కం జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు మార్పు చేస్తూ మంచిర్యాలకు తరలించగా, క్రమంగా కోర్టుల సంఖ్య పెరుగుతూ వచ్చింది.
తొమ్మిది కోర్టుల ద్వారా న్యాయ సేవలు...
ప్రస్తుతం జిల్లా కేంద్రంలో వివిధ స్థాయిల్లోని తొమ్మి ది కోర్టుల ద్వారా ప్రజలకు న్యాయ సేవలు అందుతు న్నాయి. జిల్లా జడ్జి కోర్టుతోపాటు అదనపు జిల్లా జడ్జి కోర్టు, ఒక సీనియర్ సివిల్ జడ్జి కోర్టు, అడిషనల్ సీని యర్ సివిల్ జడ్జి కోర్టు, మూడు జూనియర్ సివిల్ జ డ్జి కోర్టులు, పోక్సో కోర్టు, జువైనల్ జస్టిస్ బోర్డ్ ద్వారా ప్రజలకు న్యాయ సేవలు పొందుతున్నారు. వీటితోపా టు బెల్లంపల్లి, చెన్నూరు, లక్షెట్టిపేటలోనూ న్యాయ సే వలు అందుతుండగా, మందమర్రిలోనూ మరో కోర్టు ప్రారంభానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా జిల్లా కేంధ్రంలో ఉన్న కోర్టులన్నీ ప్రస్తుతం అద్దె భవ నాల్లో వేర్వేరు ప్రదేశాల్లో కొనసాగుతుండటంతో కొంత మేర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ప్రస్తుతం కోర్టుల భవనాలు జాతీయ రహదారికి ఇరువైపులా ఉండటం తో రోడ్డు దాటే సమయంలో కక్షిదారులు, న్యాయవాదు లు ఇబ్బందులు పడుతున్నారు.
ఫ్యామిలీ కోర్టు ఏర్పాటుకూ అవకాశం...
జిల్లాకు కోర్టు కాంప్లెక్స్ మంజూరైనందున ఫ్యామిలీ కోర్టు కూడా ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. 10+ 2 సముదాయంలో ఫ్యామిలీ కోర్టును పేర్కొన్నప్ప టికీ ఏర్పాటు విషయంలో ఇంకా స్పష్టమైన ఆదేశాలు జారీ కాలేదు. అయితే జిల్లాకు ఫ్యామిలీ కోర్టు కూడా వస్తుం దనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫ్యామిలీ కో ర్టులో జిల్లా వ్యాప్తంగా ఏడాదిలో సగటున 300 వరకు కేసులు నడుస్తుండగా, ప్రస్తుతం ఆ విభాగానికి చెంది న వారంతా ఆదిలాబాద్‌కు వెళ్లాల్సి వస్తోంది. జిల్లా కేం ద్రంలో ఫ్యామిలీ కోర్టు ఏర్పాటు చేస్తే ప్రజలకు రవాణా భారం తప్పుతుంది. ఫ్యామిలీ కోర్టుతోపాటు భవిష్యత్తు లో మరిన్ని కోర్టులు కూడా వచ్చే అవకాశం ఉంది.
ఐదు ఎకరాలు కేటాయింపు...
కోర్టు భవనాల సముదాయం ఏర్పాటు చేసేందుకు ప్రస్తుత కలెక్టరేట్ భవనం సమీపంలో ఐదు ఎకరాలను కేటాయించారు. మొదట జిల్లా కేంధ్రంలోని భూదాన్ భూముల్లో 5.20 ఎకరాలను కేటాయిస్తూ మున్సిపల్ పాలకవర్గం తీర్మానం చేసింది. ఆ స్థలం అనువుగా లేకపోవడంతో తిరిగి 2014లో జిల్లా కేంధ్రంలోని రాము ని చెరువు సమీపంలో సర్వే నెంబరు 406లో అధికా రుల నివాసాల కోసం 1.34 ఎకరాలు, కోర్టుల సము దాయం కోసం 4.30 ఎకాలను కేటాయించారు. అయితే సదరు భూములు భవనాల నిర్మాణాలకు యోగ్యం కా దనే కారణంతో టెండర్లు కూడా పూర్తయ్యాక రద్దు చే శారు. అనంతరం 2017లో నస్పూర్ శివారు సర్వే నెం బరు 42లో ఐదెకరాలు కేటాయించగా, అందులోనే కోర్టు కాంప్లెక్స్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది.
హర్షించదగ్గ విషయం...
బండవరపు జగన్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు
జిల్లా కేంధ్రంలో అన్ని రకాల న్యాయ సేవలు ప్రజ లకు అందుతున్నప్పటికీ ఇంతకాలం శాశ్వత భవనం లేక కొంతమేర ఇబ్బందులు పడక తప్పలేదు. తెలం గాణ ప్రభుత్వం కోర్టు కాంప్లెక్స్ నిర్మాణానికి పరిపాల నా అనుమతులు మంజూరు చేయడం హర్షించదగ్గ విషయం. ప్రజలకు ఒకే చోట అన్ని రకాల న్యాయ సేవలు అందే అవకాశం ఉంటుంది.